ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్వర్టు గొయ్యిలో పడిన కారు

ABN, First Publish Date - 2023-04-03T00:32:17+05:30

కొటారుబిల్లి పెట్రోల్‌ బంకు వద్ద కల్వర్టు ఏర్పాటుకు తవ్విన గొయ్యిలో ఆదివారం రాత్రి ఓ కారు పడిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గంట్యాడ: కొటారుబిల్లి పెట్రోల్‌ బంకు వద్ద కల్వర్టు ఏర్పాటుకు తవ్విన గొయ్యిలో ఆదివారం రాత్రి ఓ కారు పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. గత కొద్ది రోజులుగా విజయనగరం నుంచి బౌడర గ్రామం వరకూ రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. దీనిలోభాగంగా కొటారుబిల్లి పెట్రోల్‌ బంకు వద్ద కల్వర్టు ఏర్పాటు కోసం ఆదివారం ఉదయం గొయ్యి తవ్వి పనులు ముగించుకుని సిబ్బంది వెళ్లిపోయారు. అయితే రాత్రి 7.30 గంటల సమయంలో మండలంలోని పెణసాం గ్రామానికి చెందిన శివాజీ, గౌరినాయుడు అనే ఇద్దరు తమ గ్రామం నుంచి విశాఖపట్టణానికి కారులో వెళ్తున్నారు. కొటారుబిల్లి పెట్రో ల్‌ బంకు వద్దకు వచ్చేసరికి, అక్కడ ఉన్న గోతిని గమనించలేదు. దీంతో కారులో నేరుగా గోతిలో పడిపోయింది. అక్కడ సేఫ్టీ మెజర్‌మెంట్స్‌ ఏర్పాటు చేయని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 22న గంట్యాడ పోలీసుస్టేషన్‌ వద్ద కల్వర్టు కోసం తవ్విన గొయ్యిలో ద్విచక్రవాహనం పడిపోయి న సంగతి తెలిసిందే. రహదారి విస్తరణ చేసిన సమయంలో కనీస నిబంధనలు పాటించలేదని వాహన చోదకులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-04-03T00:32:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising