ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక ఆకర్షణగా వైఎస్సార్‌ వ్యూపాయింట్‌

ABN, First Publish Date - 2023-03-27T00:18:55+05:30

సీతకొండ మలుపులో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ వ్యూపాయింట్‌, సోలార్‌ ట్రీ సందర్శకు లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాలాక్షినగర్‌, మార్చి 26 : సీతకొండ మలుపులో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ వ్యూపాయింట్‌, సోలార్‌ ట్రీ సందర్శకు లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సీతకొండ ప్రాం తాన్ని అభివృద్ధి చేసి ఆధునీకరించిన బీచ్‌ వైఎస్సార్‌ వ్యూపాయింట్‌ను ఆదివారం ఆయన జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజనీ, మున్సిపల్‌ శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, స్పెషల్‌ సెక్రటరీ శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ రూ.233.99 లక్షల వ్యయంతో నూతన వ్యూపాయింట్‌, సోలార్‌ ట్రీ, లవ్‌ వైజాగ్‌ సెల్పీ పాయింట్‌ను ఏర్పాటు చేశామన్నారు. అలానే సాగర్‌నగర్‌ బీచ్‌, గుడ్లవానిపాలెం బీచ్‌, జోడుగుళ్లపాలెం బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సుందరీకరణలో భాగంగా ఫుట్‌పాత్‌ల మరమ్మతులు, ఫ్లోర్‌సెంట్‌ పెయింటింగ్‌లు, బస్సు షెల్టర్‌ల ఆధునీకరణ, రోడ్లకి ఇరువైపులా రంగులు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. నగర సుందరీకరణ పనులకు దాదాపు రూ. 170 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో 8,9 వార్డుల కార్పొరేటర్లు లొడగల అప్పారావు, స్వాతిదాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-27T00:18:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising