ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉద్యానశాఖ కార్యాలయం ఎక్కడ?

ABN, First Publish Date - 2023-09-03T00:26:25+05:30

ఉద్యానశాఖ కార్యాలయం ఎక్కడ?

- భవనం శిథిలావస్థకు చేరడంతో మూసివేత

- సాంకేతిక సలహాలు అందక రైతుల అవస్థలు

చింతపల్లి, సెప్టెంబరు 2:

సబ్‌ డివిజన్‌ కేంద్రంలో ఉద్యానశాఖ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక సాంకేతిక సేవలు పొందేందుకు పలువురు ఇబ్బంది పడుతున్నారు. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాలకు సంబంధించి ఉద్యాన పంటలకు అవసరమైన సాంకేతిక సేవలందించేందుకు చింతపల్లిలో ఉద్యానశాఖ అధికారిని నాలుగేళ్ల కిందట నియమించారు. ఉద్యానశాఖ కార్యాలయంగా ఆర్‌ అండ్‌ బీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న పట్టు పరిశ్రమలోని ఓ భవనాన్ని కేటాయించారు. కొంత కాలం ఈ కార్యాలయం నుంచి ఉద్యానశాఖ అధికారులు సేవలందించారు. ప్రస్తుతం ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది. దీంతో సబ్‌ డివిజన్‌ కేంద్రంలో ఉద్యానశాఖకు ప్రత్యేక కార్యాలయం లేదు. మూడు మండలాలకు సంబంధించిన ఉద్యానశాఖ అధికారి చింతపల్లిలో ఉన్నప్పటికి రైతులకు సాంకేతిక సేవలు అందడంలేదు. ప్రస్తుతం ఉద్యానశాఖ అధికారి ఎక్కడ ఉంటారో? ఉద్యానశాఖ కార్యాలయం ఎక్కడ నిర్వహిస్తున్నారో ఆదివాసీ రైతులకు తెలియని పరిస్థితి ఎదురైంది. దీంతో మెజారిటీ రైతులు ఉద్యాన పంటల సాగులో అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనల కోసం డిగ్రీ కళాశాలలో ఉన్న ఉద్యాన పరిశోధన స్థానానికి వెళ్లి నేరుగా శాస్త్రవేత్తను కలుస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీవో స్పందించి ఉద్యానశాఖకు ఒక కార్యాలయాన్ని కేటాయించి, ఉద్యానశాఖ అధికారి సేవలను రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2023-09-03T00:26:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising