ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

19 వార్డులో మౌలిక వసతులు కల్పిస్తాం

ABN, First Publish Date - 2023-02-07T00:10:54+05:30

జీవీఎంసీ పరిధిలోని 19వ వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశామని కమిషనర్‌ పి. రాజాబాబు తెలిపారు. సోమవారం ఆయన వార్డు పరిధిలోని పెదజాలారిపేట, శివగణేష్‌నగర్‌, రేసవానిపాలెం ప్రాంతాల్లో కార్పొరేటర్‌ నొల్లి నూకరత్నతో కలిసి పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదవాల్తేరు, ఫిబ్రవరి 6 : జీవీఎంసీ పరిధిలోని 19వ వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశామని కమిషనర్‌ పి. రాజాబాబు తెలిపారు. సోమవారం ఆయన వార్డు పరిధిలోని పెదజాలారిపేట, శివగణేష్‌నగర్‌, రేసవానిపాలెం ప్రాంతాల్లో కార్పొరేటర్‌ నొల్లి నూకరత్నతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వార్డులో వున్న గెడ్డలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులను అదేశించారు. పెదజాలారిపేటలో గెడ్డ నిర్మాణం, వీధి దీపాలు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, ఈపీడీసీఎల్‌ గోతుల పూడ్చి వేత, తదితర సమస్యలపై స్థానికులు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం కుర్పాం సర్కిల్‌ వద్ద రోడ్డు వెడల్పు చేసే ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో ప్రధాన వైద్యాధికారి కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి, డిసి (రెవెన్యూ) ఫణీరామ్‌, జోనల్‌ కమిషనర్‌ విజయలక్ష్మి, పర్యవేక్షక ఇంజనీర్‌ సత్యనారాయణ రాజు, ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ సునీల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:10:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising