ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మన్యంలో వైద్యారోగ్య శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ పర్యటన

ABN, First Publish Date - 2023-06-14T00:34:52+05:30

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌ యశ్మిన్‌ మంగళవారం మన్యంలో పర్యటించారు. గిరిజన ప్రాంతంలో రోగులకు అందుతున్న వైద్యారోగ్య సేవలపై ఆమె ఆరా తీశారు. తొలుతగా ఆమె హుకుంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అక్కడ రోగులతో మాట్లాడారు.

హుకుంపేట పీహెచ్‌సీలో బాలింతతో మాట్లాడుతున్న వైద్యశాఖ ఏడీ డాక్టర్‌ యశ్మిన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన్యంలో వైద్యారోగ్య శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ పర్యటన

- పాడేరు జిల్లా ఆస్పత్రి, హుకుంపేట పీహెచ్‌సీ, తుంపాడ సబ్‌ సెంటర్‌ సందర్శన

- గిరిజన రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆమె ఆరా

పాడేరు, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌ యశ్మిన్‌ మంగళవారం మన్యంలో పర్యటించారు. గిరిజన ప్రాంతంలో రోగులకు అందుతున్న వైద్యారోగ్య సేవలపై ఆమె ఆరా తీశారు. తొలుతగా ఆమె హుకుంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అక్కడ రోగులతో మాట్లాడారు. అలాగే పీహెచ్‌సీలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పలువురు బాలింతలతో మాట్లాడారు. ఆశ కార్యాకర్తలతో సమావేశమై పలు అంశాలను ఆమె వివరించారు. అనంతరం స్థానిక జిల్లా ఆస్పత్రి పరిధిలో ఉన్న పోషకాహార పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందుతున్న సేవలను ఆమె వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మండలంలో తుంపాడ ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న ఫ్యామిలీ డాక్టర్‌ సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ సి.జమాల్‌ బాషా, జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-06-14T00:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising