ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ డెయిరీ పాల ధర పెంపు

ABN, First Publish Date - 2023-03-16T00:27:39+05:30

విశాఖ డెయిరీ యాజమాన్యం పాల అమ్మకం ధరను మరోమారు పెంచేసింది. గురువారం నుంచి లీటరుకు రెండు రూపాయలు పెరగనున్నట్టు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అక్కిరెడ్డిపాలెం, మార్చి 15: విశాఖ డెయిరీ యాజమాన్యం పాల అమ్మకం ధరను మరోమారు పెంచేసింది. గురువారం నుంచి లీటరుకు రెండు రూపాయలు పెరగనున్నట్టు ప్రకటించింది. టోన్డు మిల్క్‌ (500 ఎంఎల్‌) ధర రూ.26 నుంచి రూ.27కు, డబుల్‌ టోన్డు (500 ఎంఎల్‌) రూ.24 నుంచి రూ.25కు, గంగా (500 ఎంఎల్‌) రూ.27 నుంచి 28 రూపాయలకు, పుల్‌ క్రీమ్‌ పాలు (అర లీటరు) రూ.30 నుంచి 32 రూపాయలకు పెంచింది. గత ఏడాది ఆగస్టు 16న లీటరుకు రెండు రూపాయలు పెంచిన డెయిరీ యాజమాన్యం ఏడు నెలలకే మరొకసారి రెండు రూపాయలు పెంచి వినియోగదారులపై అదనపు భారాన్ని మోపింది.

పాల సేకరణ ధరను పెంచడం వల్లనే విక్రయ ధరను పెంచవలసి వచ్చిందని విశాఖ డెయిరీ ఎండీ ఎస్‌.వి.రమణ తెలిపారు. పశువుల దాణాతో పాటు ఇతర ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ఈనెల ప్రారంభం నుంచి పాడి రైతులకు ఆవు పాలైతే లీటరుకు రెండు రూపాయలు, గేదె పాలకు 4 రూపాయలు పెంచినట్టు తెలిపారు. పాల సేకరణ ధరతో పాటు ఇతర వస్తువుల ధరలు పెరగడం వల్లనే అమ్మకం ధరను పెంచవలసి వచ్చిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు డెయిరీలు పాల ధరను పెంచాయని ఆయన తెలిపారు.

Updated Date - 2023-03-16T00:27:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising