ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాప్‌ 20లో విశాఖ విమానాశ్రయం

ABN, First Publish Date - 2023-03-12T03:14:25+05:30

విశాఖపట్నం విమానాశ్రయం దేశీయంగా టాప్‌ 20లో స్థానం దక్కించుకుంది. ఈ ఏడాది జనవరిలో దేశీయ ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించిన విమానాశ్రయాల జాబితాను భారత విమానయాన సంస్థ(ఏఏఐ) తాజాగా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జనవరిలో 2,40,518 మంది ప్రయాణికులు

43,51,399 మందితో అగ్రస్థానంలో ‘ఢిల్లీ’

19వ స్థానంలో విశాఖ ఎయిర్‌పోర్టు

రోజుకు 30 విమానాలు.. 8,500-9,000 మంది రాకపోకలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం విమానాశ్రయం దేశీయంగా టాప్‌ 20లో స్థానం దక్కించుకుంది. ఈ ఏడాది జనవరిలో దేశీయ ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించిన విమానాశ్రయాల జాబితాను భారత విమానయాన సంస్థ(ఏఏఐ) తాజాగా ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీ 43,51,399 మంది ప్రయాణికులతో అగ్రభాగాన నిలిచింది. మొత్తం దేశీయ ప్రయాణికుల్లో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించిన వారు 17.44 శాతంగా పేర్కొంది. ఆ తరువాత స్థానాల్లో వరుసగా ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా నిలిచాయి. హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి జనవరిలో 15,77,650 మంది రాకపోకలు సాగించారు. విశాఖపట్నం విమానాశ్రయం 2,40,518 మంది ప్రయాణికులతో 19వ స్థానంలో నిలిచింది. ఒడిసాలోని భువనేశ్వర్‌ విమానాశ్రయం 3,51,349 మంది ప్రయాణికులతో 14వ స్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి టాప్‌ 20లో విశాఖకు మాత్రమే స్థానం దక్కడం గమనార్హం. ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయానికి ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబై, చెన్నై, బెంగళూరు, విజయవాడ, కోల్‌కతా, త్రిపుర, రాజమండ్రి, జైపూర్‌, కడప, పుణె నుంచి రోజూ 30 విమానాలు వచ్చి, వెళుతున్నాయి. సగటున రోజుకు 8,500 నుంచి తొమ్మిది వేల మంది ఇక్కడ ప్రయాణాలు సాగిస్తున్నారు. త్వరలో విమానయాన సంస్థలు వేసవి షెడ్యూల్‌ను ప్రకటించనున్నాయి. అప్పుడు మరిన్ని విమానాలు రానున్నాయి. వేసవిలో రోజుకు పది వేల మంది ప్రయాణించే అవకాశం ఉంది. ఆ లెక్కన నెలకు మూడు లక్షల మంది రాకపోకలు సాగిస్తారు.

కరోనా తర్వాత పుంజుకొంటున్న ప్రయాణాలు..

కరోనా కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో విమాన ప్రయాణాలు బాగా తగ్గిపోయాయి. గతేడాది నుంచే క్రమంగా పుంజుకుంటున్నాయి. కరోనా సమయంలో రద్దయినవాటిలో అనేక అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇంకా పునరుద్ధరణకు నోచుకోలేదు. విశాఖపట్నం నుంచి సింగపూర్‌కు మాత్రమే ప్రస్తుతం విదేశీ సర్వీసులు నడుస్తున్నాయి. మలేషియా, శ్రీలంక, దుబాయ్‌లకు సర్వీసులు ఇంకా పునరుద్ధరించాల్సి ఉంది.

Updated Date - 2023-03-12T03:14:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising