ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

ABN, First Publish Date - 2023-03-06T00:58:39+05:30

గొలుగొండ మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను అధికారులు అమలు చేయడంలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి సీఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఫొటోలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు వుండకూడదు. అధికార పార్టీతోపాటు ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేయాలి. కానీ మండలంలో రేషన్‌ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫొటోలను తొలగించలేదు.

ఏఎల్‌పురంలో రేషన్‌ పంపిణీ వాహనంపై తొలగించని సీఎం జగన్‌ ఫొటో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రేషన్‌ పంపిణీ వాహనాలపై సీఎం జగన్‌ ఫొటో

అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపణ

కృష్ణాదేవిపేట, మార్చి 5: గొలుగొండ మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను అధికారులు అమలు చేయడంలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి సీఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఫొటోలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు వుండకూడదు. అధికార పార్టీతోపాటు ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేయాలి. కానీ మండలంలో రేషన్‌ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫొటోలను తొలగించలేదు. ఏఎల్‌పురం, కొంగసింగి, చోద్యం, పాతకృష్ణాదేవిపేట తదితర గ్రామాల్లో రేషన్‌ పంపిణీకి వచ్చిన ఎండీయూ వాహనాలపై సీఎం జగన్‌ఫొటోలు యథావిధిగా కనిపిస్తున్నాయి. కనీసం ఫొటో కనిపించకుండా కాగితాలు కూడా అతికించలేదు. ఎన్నికల అధికారులు పక్షపాతవైఖరిని అవలంబిస్తున్నారని, ఎన్నికల కోడ్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడంలేదని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-03-06T00:58:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising