బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి వంగవీటి
ABN, First Publish Date - 2023-09-04T00:16:14+05:30
డుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి దివంగత వంగవీటి మోహన్‌రంగా అని ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు అన్నారు.
బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 3 : బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి దివంగత వంగవీటి మోహన్‌రంగా అని ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని లోపూడిలో ఆదివారం రాత్రి వంగవీటి మోహన్‌రంగా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడుతూ రంగా మన మధ్య లేకపోయినా 34 సంవత్సరాలుగా ప్రజల గుండెల్లో ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాధారంగ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాళ్ళపాలెం బుజ్జి, మాలమహానాడు జిల్లా అధ్యక్షురాలు నాగమల్లీశ్వరి, జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్ రాజు, వైసీపీ వడ్డాది పట్టణ అధ్యక్షుడు దొండా నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-04T00:16:14+05:30 IST