ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్యాణం... కమనీయం!

ABN, First Publish Date - 2023-03-05T01:15:01+05:30

ఉపమాక వెంకన్న వార్షిక కల్యాణోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామి వారి వివాహవేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు, వేదపండితులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, పీసపాటి శేషాచార్యులు, నరసింహాచార్యులు, సత్యనారాయణాచార్యులు తదితరులు పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణాన్ని జరిపించారు. తొలుత ప్రధాన రాజగోపురం పక్కనప్రత్యేకంగా నిర్మించిన కల్యాణవేదికపై శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామిని పట్టుపీతాంబరాలు, స్వర్ణాభరణాలు, బంగారు కిరీటాలతో వధూవరులుగా అలంకరించారు.

Upamaka Venkanna Kalyanotsava as the festival of the eyes
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిలకించి తన్మయం చెందిన వేలాది మంది భక్తులు

నక్కపల్లి, మార్చి 4: ఉపమాక వెంకన్న వార్షిక కల్యాణోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామి వారి వివాహవేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు, వేదపండితులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, పీసపాటి శేషాచార్యులు, నరసింహాచార్యులు, సత్యనారాయణాచార్యులు తదితరులు పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణాన్ని జరిపించారు. తొలుత ప్రధాన రాజగోపురం పక్కనప్రత్యేకంగా నిర్మించిన కల్యాణవేదికపై శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామిని పట్టుపీతాంబరాలు, స్వర్ణాభరణాలు, బంగారు కిరీటాలతో వధూవరులుగా అలంకరించారు. విష్వక్సేన ఆరాధన, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర-బెల్లం, మంగళ సూత్రధారణ, తలంబ్రాల బియ్యం, వంటి ఘట్టాల గురించి అర్చకులు సవివరంగా వర్ణించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. భక్తుల గోవిందనామస్మరణతో ఆలయం మార్మోగిపోయింది.

నేత్రపర్వంగా రథోత్సవం

కల్యాణోత్సవానికి ముందు ఉపమాక గ్రామంలో రథోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. రాత్రి 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు కల్యాణ వెంకటేశ్వరుడు ఉభయదేవేరులతో కలిసి పూలతో అలంకరించిన రథంలో మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు గోవింద నామస్మరణతో రథాన్ని లాగారు.

Updated Date - 2023-03-05T01:15:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising