ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటర్ల సర్వేకు మరో రెండు రోజులు గడువు

ABN, First Publish Date - 2023-08-22T01:44:16+05:30

ఇంటింటా ఓటర్ల సర్వేకు మరో రెండు రోజులు గడువు పెంచారు.

జిల్లాలో 86.50 ఇళ్ల సర్వే, 85.69 శాతం ఓటర్ల తనిఖీ

విశాఖపట్నం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి):

ఇంటింటా ఓటర్ల సర్వేకు మరో రెండు రోజులు గడువు పెంచారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది. అయితే సర్వే పూర్తికాలేదని, గడువు పెంచాలని జిల్లా కలెక్టర్లు కోరడంతో ఎన్నికల సంఘం సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే అధికారికంగా ఇంకా ఉత్తర్వులు రాలేదు. కాగా విశాఖ జిల్లాలో 7,61,667 ఇళ్లకుగాను ఇప్పటివరకు 6,58,849 (86.5 శాతం) ఇళ్లను, 18,96,043 మంది ఓటర్లకుగాను 16,24,759 మంది ఓటర్లను తనిఖీ చేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో అత్యధికంగా పెందుర్తిలో 1,20,581కి 1,17,565 (97.5 శాతం) ఇళ్లను సర్వే చేయగా...తక్కువగా విశాఖ తూర్పులో 1,07,882 ఇళ్లకుగాను 78,118 (72.41 శాతం) ఇళ్లను మాత్రమే తనిఖీ చేశారు. ఇంకా విశాఖ ఉత్తరంలో 83,592 ఇళ్లకుగాను 79,556 (95.17 శాతం) ఇళ్లు, పశ్చిమలో 94,225కి 86709 ఇళ్లు, భీమిలిలో 1,37,580కి 1,23,993 (90.12 శాతం), గాజువాకలో 1,20,961 ఇళ్లకుగాను 96,453 (79.74 శాతం), విశాఖ దక్షిణలో 96,846కి 76358 (78.95 శాతం) ఇళ్లను సర్వే చేశారు.

Updated Date - 2023-08-22T01:44:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising