నేడు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవం
ABN, First Publish Date - 2023-01-26T01:22:32+05:30
నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.
ఏర్పాట్లు పూర్తి
ఉదయం తొమ్మిది గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న కలెక్టర్
విశాఖపట్నం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం తొమ్మిది గంటలకు కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం సాయుధ దళాల పరేడ్ ను పరిశీలించి జిల్లా ప్రగతిపై మాట్లాడతారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ తరువాత సుమారు 400 మంది ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. ఇంకా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 6,650 మంది డ్వాక్రా మహిళలకు రూ.24.6 కోట్ల రుణాలు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ద్వారా రూ.3.5 లక్షల విలువైన పరికరాలను పంపిణీ చేస్తారు.
Updated Date - 2023-01-26T01:22:33+05:30 IST