ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్స్‌ప్రెస్‌లు రాని బస్టాండ్‌ ఇది!

ABN, First Publish Date - 2023-05-31T00:19:11+05:30

ఎలమంచిలి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి నుంచి కాకినాడ, రాజమండ్రి, తుని వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే అడ్డరోడ్డు, నక్కపల్లి వెళ్లి ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది.

ఎలమంచిలి ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపిన మెట్రో బస్సులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేవలం మెట్రోలు, పల్లె వెలుగు బస్సులే ఎలమంచిలికి దిక్కు

దూర ప్రాంతాలకు వెళ్లాలంటే అడ్డరోడ్డు, నక్కపల్లి వెళ్లాల్సిందే..

తిరుగు ప్రయాణంలో బైపాస్‌ వద్ద దిగి ఆటోల్లో రావాల్సిందే..

జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా తమ సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికుల ఆవేదన

ఎలమంచిలి, మే 30:

ఎలమంచిలి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి నుంచి కాకినాడ, రాజమండ్రి, తుని వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే అడ్డరోడ్డు, నక్కపల్లి వెళ్లి ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. పేరుకే నియోజకవర్గ కేంద్రమని, బస్టాండ్‌కు కేవలం మెట్రోలు, పల్లె వెలుగు బస్సులే వస్తాయని, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఇక్కడికి రావని ఈ ప్రాంతవాసులు ఆవేదన చెందుతున్నారు.

ఎలమంచిలి బస్టాండ్‌లో నాలుగు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఎలమంచిలి నుంచి విశాఖ, గాజువాక, పాయకరావుపేటకు బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. కేవలం మెట్రో, పల్లె వెలుగు బస్సులు మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా, అటు నుంచి రావాలన్నా ఎక్స్‌ప్రెస్‌ బస్సుల కోసం బైపాస్‌ రోడ్డుకు వెళ్లాల్సిందే. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను బైపాస్‌ రోడ్డుపై దించేస్తుండడంతో అక్కడి నుంచి ఎలమంచిలి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక చార్జీలు చెల్లించి ఆటోల్లో చేరుకోవలసి వస్తోంది.

అసంపూర్తి ఫ్లైఓవర్‌ వంతెనను సాకుగా చూపి..

ఎలమంచిలి కొక్కిరాపల్లి వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ వంతెన పూర్తికాకపోవడంతో ఇదే సాకుగా చూపి పట్టణంలోకి సుమారు నాలుగు సంవత్సరాల నుంచి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు రావడం లేదు. ఎలమంచిలి బస్టాండ్‌కు కేవలం మెట్రో, పల్లె వెలుగు బస్సులే వస్తున్నాయి. ఫ్లైఓవర్‌ వంతెన నిర్మాణం ప్రారంభానికి ముందు పదుల సంఖ్యలో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఎలమంచిలి బస్టాండ్‌లోకి వచ్చేవి. దీంతో ఇక్కడి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లడం సులువుగా ఉండేది. అయితే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించినప్పటి నుంచి ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఎలమంచిలి బస్టాండ్‌కు రావడం లేదు. దీంతో ఇక్కడి ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ తమ సమస్యను పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

Updated Date - 2023-05-31T00:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising