ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోపణలపై జడ్పీటీసీ ఆధారాలు చూపాలి

ABN, First Publish Date - 2023-02-26T01:05:52+05:30

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో జగనన్న ఇళ్ల కాలనీ స్థలాలు అనర్హులకు ఇచ్చారని జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని వైసీపీ మండల నాయకులు డిమాండ్‌ చేశారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైసీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని జడ్పీ సమావేశంలో

దొండా రాంబాబు వ్యాఖ్యలు చేయడం తగదు

బుచ్చెయ్యపేట, ఫిబ్రవరి 25 : జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో జగనన్న ఇళ్ల కాలనీ స్థలాలు అనర్హులకు ఇచ్చారని జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని వైసీపీ మండల నాయకులు డిమాండ్‌ చేశారు. వైసీపీ మండల అధ్యక్షుడు కొల్లిమళ్ళ అచ్చెంనాయుడు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దేవర అప్పారావు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మరిసా నాని, విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ, వైసీపీ మండల వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ నమ్మి అప్పలరాజు తదితరులు శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. అనర్హులకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాల వివరాలు, వడ్డాది లేఅవుట్‌లో 45మంది ఒక్కో కాలనీ ఇళ్ల స్థలాన్ని రూ.2 లక్షలు చొప్పున అమ్మేసుకున్నారన్న ఆరోపణలకు తగిన ఆధారాలను జడ్పీటీసీ రాంబాబు చూపాలని వారంతా పట్టుబట్టారు. ఎమ్మెల్యే ధర్మశ్రీకి చెడ్డపేరు తెచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. తగిన ఆధారాలు చూపకపోతే సహించేది లేదని వారంతా హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ నాగేశ్వరిదేవి భర్త దాకవరపు నాగేశ్వరరావు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-26T01:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising