కొబ్బరి పీచు పరిశ్రమ ఆహుతి
ABN, First Publish Date - 2023-05-20T01:44:21+05:30
రాంబిల్లిలోని ఒక కొబ్బరిపీచు పరిశ్రమలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాధాస్వామి ఫైబర్ ఇండస్ర్టీస్ పేరుతో వైసీపీ మండల కన్వీనర్ పి.కిశోర్ నిర్వహిస్తున్న ఈ పరిశ్రమలో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు లేచి పొగలు వ్యాపించాయి.
షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
రూ.కోటిన్నర ఆస్తి నష్టం
రాంబిల్లి, మే 19: రాంబిల్లిలోని ఒక కొబ్బరిపీచు పరిశ్రమలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాధాస్వామి ఫైబర్ ఇండస్ర్టీస్ పేరుతో వైసీపీ మండల కన్వీనర్ పి.కిశోర్ నిర్వహిస్తున్న ఈ పరిశ్రమలో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు లేచి పొగలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఎలమంచిలి, అచ్యుతాపురం సెజ్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కొబ్బరిపీచుతోపాటు, యంత్రాలు, పనిముట్లు కాలిపోయాయి. కార్మికులు మధ్యాహ్న భోజనానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. సుమారు కోటిన్నర రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని పరిశ్రమ యజమాని కిశోర్ తెలిపారు.
Updated Date - 2023-05-20T01:44:21+05:30 IST