18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి
ABN, First Publish Date - 2023-07-21T01:10:00+05:30
నియోజకవర్గంలోని 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరూ ఓటుహక్కు నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పిలుపునిచ్చారు.
కశింకోట, జూలై 20: నియోజకవర్గంలోని 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరూ ఓటుహక్కు నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పిలుపునిచ్చారు. మండలంలోని చింతలపాలెంలో గురువారం కొత్త ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త ఓటర్ల చేరికపై టీడీపీ శ్రేణులందరూ దృష్టి సారించాలన్నారు. ఓటరు వెరిఫికేషన్ స్పెషల్ డ్రైవ్‌లో టీడీపీ నాయకులందరూ పాల్గొవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాస్తున్నాడని ఆరోపించారు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు ప్రజల ఓట్లను జాబితా నుంచి తొలగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కాయల మురళీ, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి గొంతిన శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు మజ్జి నిరంజన్‌కుమార్, మజ్జి నానిబాబు, వేగి గోపీకృష్ణ, ఎంపీటీసీ సభ్యుడు షేక్ దర్గా పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T01:10:00+05:30 IST