ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2023-06-07T00:46:08+05:30

ఒడిశా రైలు ప్రమాద బాధిత కుటుంబాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

నెహ్రూచౌక్‌లో కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుమ్మపాల, జూన్‌ 6 : ఒడిశా రైలు ప్రమాద బాధిత కుటుంబాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పట్టణంలోని కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి మృతులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ప్రమాదంపై క్షేత్రస్థాయిలో దర్యాప్తును చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోలారపు త్రినాథ్‌, బొద్దపు ప్రసాద్‌, సబ్బవరపు గణేష్‌, ఆళ్ల రామచంద్రరావు, ఆకుల నానాజీ, సూరే సతీష్‌కుమార్‌, ధనాల విష్ణుచౌదరి పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising