ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గొర్రెలు, మేకల పెంపకందారులకు సబ్సిడీపై రుణాలివ్వాలి

ABN, First Publish Date - 2023-08-02T00:43:26+05:30

రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందారులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ అమరేంద్రకుమార్‌ను మంగళవారం కోరినట్టు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరామ్‌ తెలిపారు.

డైరెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న సంఘ ప్రతినిధులు

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు1 : రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందారులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ అమరేంద్రకుమార్‌ను మంగళవారం కోరినట్టు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరామ్‌ తెలిపారు. ప్రతి పెంపకందారునికి 54 శాతం సబ్సిడీతో లక్ష రూపాయలు చొప్పున రుణం ఇవ్వాలని కోరామన్నారు. ఎన్‌సీడీసీ రూ. 88 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేసి ఆరు నెలలు కావస్తున్నా వాటిని విడుదల చేయలేదన్నారు. గొర్రెలు, మేకల రక్షణకు 90 శాతం సబ్సిడీతో ఉపాధి హామీ నిధులతో షెడ్లు నిర్మించాలని కోరామన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని డైరెక్టర్‌ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. డైరెక్టర్‌ను కలిసిన వారిలో సంఘ ప్రతినిధులు పీవీ ఆంజనేయులు, కిలారి పెదబ్బాయి, పి. తిరుపతిరావు ఉన్నారు.

Updated Date - 2023-08-02T00:43:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising