ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాఠ్యపుస్తకాల కోసం ఇంటర్‌ విద్యార్థుల ఆందోళన

ABN, First Publish Date - 2023-06-26T23:03:06+05:30

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు.

ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 26 : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. నెహ్రూచౌక్‌లో మానవహారంగా ఏర్పడి, ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మామిడి రమణ ఆధ ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సీహెచ్‌. పావని మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ప్రారంభమై 15 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. అలాగే కళాశాలల్లో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, హాస్టల్‌ విద్యార్థులకు కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు గొర్లి తరుణ్‌, సీహెచ్‌. శివాజీ, దివాకర్‌, బాబ్జి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:03:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising