ఉక్కు పోరాటం
ABN, First Publish Date - 2023-05-04T01:37:03+05:30
స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉక్కు కార్మిక సంఘాలు, బీజేపీయేతర పార్టీలు గాజువాక, కూర్మన్నపాలెం, పెదగంట్యాడ, మద్దిలపాలెం జంక్షన్లలో ఆందోళనలు నిర్వహించాయి. కూర్మన్నపాలెంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. ‘మోదీ డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేస్తూ కార్మికులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఒక్క బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ కార్మికులంతా ఐకమత్యంతో పోరాడిననాడే, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రైవేటీకరణ ప్రక్రియను నిలుపుదల చేసే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాలన్నారు.
స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ
నగరంలో పలుచోట్ల రాస్తారోకోలు
కూర్మన్నపాలెంలో పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం....నేతల అరెస్టు
పాతగాజువాక, మద్దిలపాలెం, పెదగంట్యాడ ప్రాంతాల్లో ఆందోళనలు
‘సేవ్ స్టీల్‌ప్లాంటు’, ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ
నినాదాలు
విశాఖపట్నం/గాజువాక/
కూర్మన్నపాలెం/ఉక్కు టౌన్‌షిప్, మే 3:
స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉక్కు కార్మిక సంఘాలు, బీజేపీయేతర పార్టీలు గాజువాక, కూర్మన్నపాలెం, పెదగంట్యాడ, మద్దిలపాలెం జంక్షన్లలో ఆందోళనలు నిర్వహించాయి. కూర్మన్నపాలెంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. ‘మోదీ డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేస్తూ కార్మికులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఒక్క బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ కార్మికులంతా ఐకమత్యంతో పోరాడిననాడే, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రైవేటీకరణ ప్రక్రియను నిలుపుదల చేసే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాలన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే తమ పోరాటాన్ని రాష్ట్ర ఉద్యమంగా మారుస్తామన్నారు. రాస్తారోకో సందర్భంగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో 26 మంది పోరాట కమిటీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టీల్‌ప్లాంటు స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో డి.ఆదినారాయణ, జె.అయోధ్యరాం, వరసాల శ్రీనివాసరావు, ఎన్.రామచంద్రరావు, 78వ వార్డు కార్పొరేటర్ గంగారామ్, రామస్వామి, కేఎం శ్రీనివా్‌స, రమణమూర్తి, ఉమామహేశ్వరరావు, తదితరులు ఉన్నారు. నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్లాంట్ విషయంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ...‘సేవ్ స్టీల్‌ప్లాంట్’ అని నినాదాలు చేశారు.
పాతగాజువాకలో...
అఖిల పక్ష కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పాతగాజువాక జంక్షన్‌లో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వామపక్ష పార్టీల నేతలు సీహెచ్ నరసింగరావు, కె.సత్యనారాయణ, ఇంటక్ నాయకుడు మంత్రి రాజశేఖర్, మస్తానప్ప, యేల్లేటి శ్రీనివాసరావులు రాస్తారోకో నిర్వహించగా పోలీసులు అదుపులోకి తీసుకొని గాజువాక స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్లాంటు ప్రైవేటుపరం కానివ్వబోమన్నారు. పాతగాజువాకలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని మద్దతు ప్రకటించారు. కాగా అరెస్టు అయిన ఆందోళనకారులను సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
Updated Date - 2023-05-04T01:37:03+05:30 IST