19 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
ABN, First Publish Date - 2023-01-29T00:50:09+05:30
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను 19 మంది ఉపాధ్యాయులకు డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాయకరావుపేట మండలంలో పాల్తేరు, ఈదటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను డిప్యూటీ డీఈవో శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠ్యాంశ ప్రణాళిక సరిగా లేకపోవడం, నోట్‌బుక్స్ కరక్షన్స్ చేయకపోవడం, జవాబు పత్రాలను సక్రమంగా దిద్దకపోవడం వంటి లోపాలను గుర్తించారు. అంతేకాకుండా అతను అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సరిగా సమాధానాలు చెప్పకపోవడంతో పాల్తేరు పాఠశాలలో 12 మంది, ఈదటంలో ఏడుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి కేఎన్ గాంధీ ఉన్నారు.
పాల్తేరు, ఈదటం పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్
పాయకరావుపేట రూరల్, జనవరి 28: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను 19 మంది ఉపాధ్యాయులకు డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాయకరావుపేట మండలంలో పాల్తేరు, ఈదటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను డిప్యూటీ డీఈవో శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠ్యాంశ ప్రణాళిక సరిగా లేకపోవడం, నోట్‌బుక్స్ కరక్షన్స్ చేయకపోవడం, జవాబు పత్రాలను సక్రమంగా దిద్దకపోవడం వంటి లోపాలను గుర్తించారు. అంతేకాకుండా అతను అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సరిగా సమాధానాలు చెప్పకపోవడంతో పాల్తేరు పాఠశాలలో 12 మంది, ఈదటంలో ఏడుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి కేఎన్ గాంధీ ఉన్నారు.
Updated Date - 2023-01-29T00:50:10+05:30 IST