ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ మాఫియా బారి నుంచి రక్షించండి మహాప్రభో!

ABN, First Publish Date - 2023-04-03T01:08:11+05:30

భూ మాఫియా బారి నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ అనంతగిరి మండలం నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. తమకు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు న్యాయం చేయాలంటూ మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించి వేడుకుంటున్నారు. మండల గిరిజన సంఘం, సీఐటీయూ నాయకులతో కలిసి గిరిజనులు ఆదివారం వినూత్న రీతిలో నిరసన తెలిపి అనంతరం విలేఖరులకు తమ గోడు వెలిబుచ్చారు.

తమకు న్యాయం చేయాలని మోకాళ్లపై కూర్చొని వేడుకుంటున్న చినకూనెల, బూరిగ గ్రామాల గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- మా భూములు లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు

- కలెక్టర్‌, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ న్యాయం చేయాలి

- నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాంత గిరిజనుల వేడుకోలు

అరకులోయ, ఏప్రిల్‌ 2: భూ మాఫియా బారి నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ అనంతగిరి మండలం నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. తమకు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు న్యాయం చేయాలంటూ మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించి వేడుకుంటున్నారు. మండల గిరిజన సంఘం, సీఐటీయూ నాయకులతో కలిసి గిరిజనులు ఆదివారం వినూత్న రీతిలో నిరసన తెలిపి అనంతరం విలేఖరులకు తమ గోడు వెలిబుచ్చారు. భూ మాఫియా తమ భూములు లాక్కొనేందుకు ప్రయత్నిస్తోందని వాపోయారు. అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ చినకూనెల రెవెన్యూ పరిధిలో 1 నుంచి 6 సర్వే నంబర్‌ వరకు ఉన్న 30 ఎకరాలు జిరాయితీ భూమి, బూరిగ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 1 నుంచి 12 వరకు 90 ఎకరాల జిరాయితీ భూమిలో మొత్తం 112 కుటుంబాలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ భూములకు సంబంధించి తమకు తెలియకుండా రికార్డుల్లో మార్పులు చేశారని, దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఈ భూములు తమకు దక్కకుండా కొందరు ప్రయత్నిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ బూరిగ, చినకూనెల గ్రామాలకు చెందిన రైతులు, గిరిజన సంఘం, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T01:08:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising