సీజన్ ఆఖరిలోనూ అదే సీన్
ABN, First Publish Date - 2023-03-02T01:06:19+05:30
శీతాకాల సీజన్ ఆఖరిలోనూ చెరువులవేనం మంచు అందాలు ప్రకృతి ప్రేమికులను అలరిస్తున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి నెలాఖరుతో లంబసింగి, చెరువులవేనంలో మంచు అందాలు కనుమరుగవుతాయి.
- అలరిస్తున్న చెరువులవేనం మంచు అందాలు
చింతపల్లి, ఫిబ్రవరి 1:
శీతాకాల సీజన్ ఆఖరిలోనూ చెరువులవేనం మంచు అందాలు ప్రకృతి ప్రేమికులను అలరిస్తున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి నెలాఖరుతో లంబసింగి, చెరువులవేనంలో మంచు అందాలు కనుమరుగవుతాయి. ఈ ఏడాది మార్చి వచ్చేసినా చెరువులవేనంలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. శ్వేతవర్ణ మంచు మేఘాలు పచ్చని కొండలను తాకుతూ పయనిస్తున్నాయి. దీంతో ఇప్పటికి మంచు అందాలను తిలకించేందుకు మైదాన ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ప్రస్తుతం మంచు ఉధృతి తగ్గింది. కాగా ఏజెన్సీ వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయి. బుధవారం చింతపల్లిలో పది డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉంది.
Updated Date - 2023-03-02T01:06:19+05:30 IST