ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో రోజూ అదే సందడి

ABN, First Publish Date - 2023-03-05T00:08:05+05:30

పెట్టుబడులదారుల సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ సందర్శకులను ఆకట్టుకున్నాయి. రెండో రోజు ప్రదర్శనలో సుమారు 137 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : పెట్టుబడులదారుల సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ సందర్శకులను ఆకట్టుకున్నాయి. రెండో రోజు ప్రదర్శనలో సుమారు 137 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. వీటిలో వివిధ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, మహిళా సంఘాలు, హస్త కళాకారులు ఉత్పత్తి చేసిన, తయారు చేసిన వస్తువులు, కళాకృతులతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తి చేసిన యుద్ధ విమానాలు, మిస్సైల్స్‌ వంటి కూడా ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆయా సంస్థల కార్యకలాపాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తీరును ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు, నగరవాసులు ఈ ఎగ్జిబిషన్‌ ను సందర్శించారు.

ఆకట్టుకున్న తోలు బొమ్మలాట

గుంటూరుకు చెందిన తోలు బొమ్మలాట కళాకారులు స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శన పలువుర్ని ఆకట్టుకుంది. ప్రతినిధులు టి.పవన్‌కుమార్‌, ఏ. సుబ్బారావు, టి. గణపతి, టి. అంజిబాబు, జె. జయశ్రీ, ఎం. రాణి రామాయణ, మహాభారత, భాగవతాలకు సంబంధించిన అనేక ఘట్టాలను తోలుబొమ్మ లాట ద్వారా ప్రదర్శించి చూపించారు. వీటిని పలువురు ఆసక్తిగా తిలకించారు. రెండు రోజుల ప్రద ర్శనలోనూ ఈ తోలు బొమ్మలాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా వీటిని ఆసక్తిగా తిలకించారు.

మౌరీ టెక్‌.. ఐటీ సేవలు

ఐటీ సంస్థల్లో అవసరమైన సేవలు అందించడంతో పాటు వ్యాపారంలో సహాయ, సహకారాలు అందిస్తున్న మౌరీ టెక్‌ సంస్థ స్టాల్‌ ఏర్పాటు చేసింది. ఈ స్టాల్‌ ద్వారా వినూత్న ఆలోచనలతో వచ్చే ఇన్నోవేటర్స్‌కు అవసరమైన సహకారాన్ని అందించడంతో పాటు ఇప్పటికే వ్యాపారాలు ఏర్పాటు చేసి నడుపుతున్న వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నట్టు సంస్థ సీనియర్‌ మేనేజర్‌ దీపక్‌ ఎం తెలిపారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ఇన్వెస్టర్స్‌కు ఇక్కడ అవసరమైన అన్ని సేవలు అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ స్టాల్‌ ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.

ఒక జిల్లా నుంచి ఒక ఉత్పత్తి

వన్‌ డిస్ర్టిక్‌.. వన్‌ ప్రొడెక్ట్‌ పేరుతో ఓడీఓపీ స్టాల్‌లో ప్రదర్శించిన పలు ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. విభజిత 26 జిల్లాల్లో పేరుగాంచిన ఒక్కో ఉత్పత్తిని ఈ స్టాల్‌లో ఏర్పాటు చేశారు. అనకాపల్లి బెల్లం, తాటాకుల ఉత్పత్తులు, బొబ్బిలి వీణ, కొండపల్లి బొమ్మలు, కాకినాడ కళంకారి చీర లతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తెల్లని వుడ్‌ క్రాఫ్ట్స్‌, విజయవాడ నుంచి తెచ్చిన కొండ పల్లి బొమ్మలు, పల్నాడు ప్రాంతానికి చెందిన లెదర్‌ వస్తువులు, ఏటికొప్పాక ఉత్పత్తులు, తిరుపతి నుంచి చెక్కతో తయారు చేసిన బొమ్మలు, చిత్తూరు జిల్లా నుంచి టెర్రాకోట మట్టితో చేసిన ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారు. ఆయా ఉత్పత్తులను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ యుద్ధ విమానాల ప్రదర్శన

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ సంస్థ పలు యుద్ధ విమానాలను స్టాల్‌లో ప్రదర్శించింది. సైనిక దళాలు అవసరాల కోసం తయారు చేసే యుద్ధ హెలికాప్టర్లను కూడా ప్రదర్శించారు. వీటిలో లైట్‌ కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌, లైట్‌ యూటీలిటీ హెలికాఫ్ట్‌ర్‌, సుఖోయ్‌ (యుద్ధ విమానం), డార్నియర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ (19 సీటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌) వంటి యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్స్‌ నమూనాలను ఏర్పాటు చేశారు. వీటి తయారీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ చేస్తున్నప్పటికీ కొన్నింటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఉద్దేశంతో ప్రదర్శనలో స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్న వారికి అవకాశం కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో అవకాశాలు

రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో యూనిట్లు పెట్టుకునేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. వీటిపై యువతకు అవగాహన కల్పించడంతో పాటు ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ తరఫున అందిస్తున్న సహాయ, సహకారాలను యువతకు తెలియజేసే ఉద్దేశంతో ప్రత్యేకంగా స్టాల్‌ ఏర్పాటు చేశారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందించే పథకాలు, రాయితీలను ఇక్కడ వివరించారు. డిస్ర్టిక్ట్‌ రీసోర్స్‌ పర్సన్స్‌ సునీల్‌కుమార్‌, ప్రతాప్‌ కుమార్‌ సందర్శకులకు వివరాలను వెల్లడించారు.

Updated Date - 2023-03-05T00:08:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising