‘ఎంవీ విశ్వచేత్న’ నౌకకు మరమ్మతులు పూర్తి
ABN, First Publish Date - 2023-09-03T03:14:33+05:30
‘ఎంవీ విశ్వచేత్న’ నౌక మరమ్మతులు హిందుస్థాన్ షిప్‌యార్డు విజయవంతంగా పూర్తిచేసింది. పానామాక్స్ తరగతికి చెందిన ఈ నౌకలో బల్క్ కార్గోను తరలిస్తారు.
మల్కాపురం (విశాఖపట్నం), సెప్టెంబరు 2: ‘ఎంవీ విశ్వచేత్న’ నౌక మరమ్మతులు హిందుస్థాన్ షిప్‌యార్డు విజయవంతంగా పూర్తిచేసింది. పానామాక్స్ తరగతికి చెందిన ఈ నౌకలో బల్క్ కార్గోను తరలిస్తారు. దీని సామర్ధ్యం 81,733 డబ్ల్యుటి. ముంబైలోని ఎస్‌సీఐకి చెందిన ఈ నౌక మరమ్మతులకు 70 రోజుల గడువుతో ఇక్కడకు వచ్చింది. డ్రై డాక్‌లో దీనికి మరమ్మతులు చేశారు. హల్, ఇంజనీరింగ్ పనులన్నీ పూర్తిచేసి శనివారం ఆ కంపెనీకి అందజేశారు. దీనికి ముందు ఆగస్టు 31న ఎంవీ జగ్ రాధా నౌక అత్యవసర మరమ్మతులు చేసిన సంగతి తెలిసిందే.
Updated Date - 2023-09-03T03:14:33+05:30 IST