నాన్‌స్టాప్ బస్సుల రిజర్వేషన్ చార్జీ తగ్గింపు
ABN, First Publish Date - 2023-01-29T00:53:11+05:30
విశాఖపట్నం-శ్రీకాకుళం నాన్‌స్టాప్ సర్వీసుల్లో టిక్కెట్ రిజర్వేషన్ చార్జీని రూ.20ల నుంచి రూ.5కు తగ్గిస్తూ ప్రజా రవాణా శాఖ (పీటీడీ) నిర్ణయం తీసుకుంది.
రూ.20 నుంచి రూ.5కు...
ద్వారకా బస్‌స్టేషన్, జనవరి 28:
విశాఖపట్నం-శ్రీకాకుళం నాన్‌స్టాప్ సర్వీసుల్లో టిక్కెట్ రిజర్వేషన్ చార్జీని రూ.20ల నుంచి రూ.5కు తగ్గిస్తూ ప్రజా రవాణా శాఖ (పీటీడీ) నిర్ణయం తీసుకుంది. దీనిని శనివారం నుంచి అమలుచేసింది. విశాఖ నుంచి శ్రీకాకుళం ఉదయం 5:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు ఒక నాన్‌స్టాప్ ఉంది. ఇప్పటివరకు ఈ సర్వీసులకు రిజర్వేషన్ చార్జీగా రూ.20 వసూలుచేసేవారు. శనివారం నుంచి ఐదు రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వచ్చే నాన్‌స్టాపు సర్వీసులకు కూడా రిజర్వేషన్ చార్జీల తగ్గింపు వర్తిస్తుందని రీజనల్ మేనేజర్ అందవరపు అప్పలరాజు తెలిపారు.
జోనల్ పరిధికి విస్తరణ
విశాఖ నుంచి విజయనగరం, సాలూరు, పార్వతీపురం, నర్సీపట్నం, పాడేరు, చోడవరం, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు వెళ్లే అన్ని నాన్‌స్టాప్ సర్వీసుల టిక్కెట్ రిజర్వేషన్ చార్జీలు సోమవారం నుంచి రూ.20 నుంచి రూ.5కు తగ్గించనున్నట్టు పీటీడీ అధికారులు తెలిపారు.
Updated Date - 2023-01-29T00:53:12+05:30 IST