ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శారదా పీఠంలో అరుణ పారాయణం

ABN, First Publish Date - 2023-01-29T00:46:41+05:30

చినముషిడవాడలోని శారదా పీఠంలో పీఠాఽధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వీయ పర్యవేక్షణలో పీఠం వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రథసప్తమి సందర్భంగా సూర్యారాధనతో ఉత్సవాలను ప్రారంభించారు.

శారదాపీఠంలో అరుణ పారాయణాన్ని పఠిస్తున్న వేద పండితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా జరుగుతున్న పీఠం వార్షికోత్సవాలు

పెందుర్తి, జనవరి 28: చినముషిడవాడలోని శారదా పీఠంలో పీఠాఽధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వీయ పర్యవేక్షణలో పీఠం వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రథసప్తమి సందర్భంగా సూర్యారాధనతో ఉత్సవాలను ప్రారంభించారు. ఆదిత్యునికి ప్రణమిల్లి సూర్యనమస్కారాలు చేశారు. సూర్య నారాయణుడిని స్తుతిస్తూ అరుణ పారాయణం, సౌర హోమం జరిపారు. స్వయంజ్యోతి మండంపంలో సూర్యానారయణస్వామి అలంకరణకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి హారతులిచ్చారు. పీఠం యాగశాలలో లక్షమూల మంత్ర రాజశ్యామల యాగాన్ని వేదోక్తంగా రుత్వికులు నిర్వహిస్తున్నారు. అలాగే మన్యుసూక్త వనదుర్గా హోమాలు జరపడంతో పాటు చంద్రమౌళీశ్వరులకు పీఠార్చన చేశారు.

యోగా కేంద్రం ఆధ్వర్యంలో..

చినముషిడివాడలోని ఓంకార్‌ యోగా కేంద్రం ఆధ్వర్యంలో రథసప్తమిని పురస్కరించుకుని 108 మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేశారు. వివిధ భంగిమల్లో యోగాసనాలు వేసి ఆదిత్యునికి ప్రణమిల్లితూ సూర్య నమస్కారాలు నిర్వహించారు. యోగా గురువు దాడి సురేశ్‌ పర్యవేక్షణలో విద్యార్థులు ప్రదర్శించిన సూర్య నమస్కారాలు అందరినీ అలరించాయి.

Updated Date - 2023-01-29T00:46:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising