ఆర్టీసీ అద్దె బస్సు కార్మికుల నిరసన
ABN, First Publish Date - 2023-08-22T23:50:12+05:30
జిల్లా రవాణా అధికారి సర్క్యూలర్‌కు విరుద్ధంగా పీటీడీ యజమాన్యం, కార్మికులపై చర్యలు తీసుకుంటున్నదని ఆర్టీసీ అద్దె బస్సుల కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పలకా సత్యనారాయణ ఆరోపించారు.
అనకాపల్లి టౌన్, ఆగస్టు 22: జిల్లా రవాణా అధికారి సర్క్యూలర్‌కు విరుద్ధంగా పీటీడీ యజమాన్యం, కార్మికులపై చర్యలు తీసుకుంటున్నదని ఆర్టీసీ అద్దె బస్సుల కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పలకా సత్యనారాయణ ఆరోపించారు. స్థానిక పీటీడీ (ఆర్టీసీ) డిపో ఎదుట మంగళవారం ఉదయం ఆర్టీసీ అద్దె బస్సుల కార్మికులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2019లో జారీ చేసిన సర్క్యూలర్‌లో ఆర్టీసీ డ్రైవర్లకు, అద్దె బస్సుల డ్రైవర్లకు ఒకే విధమైన పనిష్‌మెంట్లు ఇవ్వాలని ఎండీ పేర్కొన్నారని, కానీ అనకాపల్లి డిపోలో ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నదని అన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు మాట్లాడుతూ, అద్దె బస్సుల కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు అప్పారావు, కార్మికులు నాయుడు, వర్మ, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-22T23:50:12+05:30 IST