మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి
ABN, First Publish Date - 2023-09-26T00:49:31+05:30
సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి. మాణిక్యం, డీడీ వరలక్ష్మి డిమాండ్ చేశారు.
ఆర్డీవోకు వినతిపత్రం ఇస్తున్న మహిళలు
అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 25: సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి. మాణిక్యం, డీడీ వరలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్డీవో చిన్నికృష్ణకు వారు వినతిపత్రాన్ని అందజేశారు. ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నందున ఉపాధి హామీ పథకం కింద పనులు ఇవ్వాలని కోరారు. డ్వాక్రా మహిళలకు ఇస్తున్న రుణం మొత్తాన్ని సున్నా వడ్డీ కింద జమ చేయాలని వినతిపత్రంలో కోరారు.
Updated Date - 2023-09-26T00:49:31+05:30 IST