యాదవ సంఘం ఆధ్వరంలో విద్యార్థులకు పురస్కారాలు
ABN, First Publish Date - 2023-07-03T00:48:54+05:30
యాదవ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
అనకాపల్లి టౌన్, జూలై 2 : యాదవ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఆదివారం తుమ్మపాల ప్రైవేటు ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్ర మంలో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 120 మంది విద్యార్థినీ, విద్యార్థులకు, ఇంటర్‌లో 900కు పైగా మార్కులు వచ్చిన 40 మంది విద్యార్థినీ,విద్యార్థులకు రూ.వెయ్యి చొప్పున నగదు బహుమతితోపాటు ధ్రువపత్రాలను అందజేశారు. అలాగే ఇంటర్మీడియట్‌లో అత్యధికంగా మార్కులతో ప్రఽథమ స్థానంలో నిలిచిన మునగపాకకు చెందిన కోళ్ల చంద్రికకు రూ.ఐదు వేలు, పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన నక్కపల్లికి చెందిన కురందాసు నీరజాకు రూ.ఐదు వేలు అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. వెంగళరావుయాదవ్,ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్, విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి అక్కరమాని వెంకటరావుయాదవ్‌లు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంక్షేమ సంఘం ప్రతినిధులు భరణికాన సాయినాథరావు, ఒమ్మి సన్యాసిరావుయాదవ్, భరణికాన రామారావుయాదవ్, పల్లా చినతల్లి, పెంటారావు, సబ్బి శ్రీనివాస్, కరక సోమినాయుడు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-03T00:48:54+05:30 IST