రేపటి నుంచి అప్పన్న ఆలయంలో పవిత్రోత్సవాలు
ABN, First Publish Date - 2023-09-22T23:59:37+05:30
వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో జరిగే వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.ఈమేరకు పూజల్లో వినియోగించే పవిత్రాలను చెన్నై నుంచి సుమారు రూ.70 వేలు వెచ్చించి కొనుగోలు చేశా రు.
సింహాచలం, సెప్టెంబరు 22 : వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో జరిగే వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.ఈమేరకు పూజల్లో వినియోగించే పవిత్రాలను చెన్నై నుంచి సుమారు రూ.70 వేలు వెచ్చించి కొనుగోలు చేశా రు. ఆదివారం రాత్రి 7 గంటలకు స్వామివారి దర్శనాలు నిలిపివేసిన అనంతరం మృత్స్యంగ్రహణము, అంకురార్పణ, ప్రత్యేక హోమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 25న ఉదయం విశేష హోమాలు, పారాయణలు, రాత్రి పవిత్రాల అధివాసములు, పారాయణలు, 26న ఉదయం విశేష పారాయణలు, హోమాలు, రాత్రి పవిత్ర సమర్పణ, 27న ఉదయం పారాయణలు, హోమాలు, రాత్రి పుర్ణాహుతి, పవిత్ర విసర్జన, 28న ఉదయం ఏకాంత స్నపనంతో ఉత్సవాలు పూర్తి కానున్నాయి. కాగా ఉత్సవాలను పురస్కరించుకుని 24 నుంచి 28 వరకు స్వామివారి సన్నిధిలో ప్రతిరోజూ జరిగే ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఉత్సవాలు జరిగే ఐదు రోజులు భక్తులకు స్వామివారి దర్శనాలు రాత్రి 7 గంటల వరకు మాత్రమే లభిస్తాయని చెప్పారు.
Updated Date - 2023-09-22T23:59:37+05:30 IST