7, 8 తేదీల్లో వీఆర్‌ఏలు 36 గంటల ధర్నా
ABN, First Publish Date - 2023-08-02T01:11:29+05:30
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల ఏడు, ఎనిమిది తేదీల్లో ‘36 గంటల ధర్నా’ చేపట్టనున్నట్టు గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధరరావు చెప్పారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేయలేదు
వీఆర్‌ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధరరావు
అనకాపల్లి టౌన్, ఆగస్టు 1: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల ఏడు, ఎనిమిది తేదీల్లో ‘36 గంటల ధర్నా’ చేపట్టనున్నట్టు గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధరరావు చెప్పారు. మంగళవారం దొడ్డి రామునాయుడు భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులను గుర్తిస్తామని, పే స్కేల్ అమలు చేస్తామని, కనీస వేతనం ఇస్తామని గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా వున్న జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో హామీ ఇచ్చారని, ఆయన ముఖ్యమంత్రి అయి నాలుగేళ్లు దాటినా హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. వీఆర్‌ఏలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఇంకా పలు డిమాండ్లపై 36 గంటలపాటు ధర్నా చేయాలని నిర్ణయించామని చెప్పారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు కె.రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.శాంతకుమారి, కోశాధికారి ఎం.సంతోశ్‌కుమార్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T01:11:29+05:30 IST