అందుబాటులో పీటీడీ కార్గో సేవలు
ABN, First Publish Date - 2023-06-26T00:59:21+05:30
ఎలమంచిలి పీటీడీ బస్టాండ్‌ను ఆదివారం డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజరు బీఏ. అప్పలనాయుడుసందర్శించారు.
ఎలమంచిలి, జూన్ 25: ఎలమంచిలి పీటీడీ బస్టాండ్‌ను ఆదివారం డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజరు బీఏ. అప్పలనాయుడుసందర్శించారు. పీటీడీ పార్శిల్ కేంద్రాన్ని పరిశీలించి కార్గో సేవలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ.. అందరికీ అందుబాటులో ఉండేలా పీటీడీ కార్గో సేవలు అందిస్తామన్నారు. కార్గో సేవలపై విస్తాృతంగా ప్రచారం చేసి మరింత ఆదాయం సమకూరేలా కృషి చేయాలన్నారు. బస్టాండ్ ఆవరణలో నిబంధనలు ప్రకారం నిర్మిస్తున్న దుకాణ సముదాయాలను పరిశీలించారు. త్వరలో డ్రైవర్ల విశ్రాంతి భవనం నిర్మించనున్నట్టు తెలిపారు. జాతీయ రహదారి మీదుగా కొన్ని బస్సులు వెళ్లిపోతున్నందున ప్రయాణికుల సౌకర్యార్ధం బస్టాండ్‌కు మరిన్ని బస్సులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - 2023-06-26T00:59:21+05:30 IST