పోటీల ముసుగులో సృజనాత్మకత మరువొద్దు
ABN, First Publish Date - 2023-06-26T00:54:26+05:30
పోటీల ముసుగులో సృజనాత్మకత, విలువలు మరవొద్దని జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. శ్రావణ్‌కుమార్ హితవు పలికారు.
అనకాపల్లి టౌన్, జూన్ 25 : పోటీల ముసుగులో సృజనాత్మకత, విలువలు మరవొద్దని జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. శ్రావణ్‌కుమార్ హితవు పలికారు. నెహ్రూ యువ కేంద్రం (ఎన్‌వైకే) ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్థానిక గౌరీ గ్రంథాలయంలో జరిగిన యువ ఉత్సవ్ -2023 ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. స్వీయ శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉన్న వారు పోటీల్లో విజేతలుగా నిలుస్తారన్నారు. పోటీలు సృజనాత్మకత వెలికితీసేందుకు దోహదపడతాయని, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి సహాయకారిగా నిలుస్తాయన్నారు. పేదరికం నుంచి సంపద సృష్టించవచ్చన్నారు. వివేకంతో కూడిన ఆలోచనా విధానంతో ముందుకు సాగితే ప్రతి వ్యక్తి కోరుకున్న గమ్యాన్ని చేరుతారన్నారు. నెహ్రూయువ కేంద్రం అధికారి జి. మహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్‌వైకే రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు కాండ్రేగుల వెంకటరమణ, ఎన్‌వైకే ఏపీఎస్ అల్లం రాంప్రసాద్, ఆర్. లీలా ప్రసాద్‌రెడ్డి, కాండ్రేగుల జగ్గారావు, కాండ్రేగుల సత్యనారాయణ, కాండ్రేగుల శంకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T00:54:26+05:30 IST