ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఎస్‌టీఎల్‌ సేవలు శ్లాఘనీయం

ABN, First Publish Date - 2023-01-18T00:07:29+05:30

దృఢమైన సానుకూల దృక్పథంతో దేశానికి అత్యుత్తమ ఫలితాలను అందించడంలో ఎన్‌ఎస్‌టీఎల్‌ చేస్తున్న సేవలు శ్లాఘనీయమని ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు.

రాఘవేంద్రరావును సత్కరిస్తున్న ఎన్‌ఎస్‌టీఎల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు

గోపాలపట్నం, జనవరి 17: దృఢమైన సానుకూల దృక్పథంతో దేశానికి అత్యుత్తమ ఫలితాలను అందించడంలో ఎన్‌ఎస్‌టీఎల్‌ చేస్తున్న సేవలు శ్లాఘనీయమని ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. ఎన్‌ఎస్‌టీఎల్‌లోని మహాపాత్ర మానసి ఆడిటోరియంలో మంగళవారం సంస్థ నిర్వహించిన సాంకేతిక చర్చా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సినీ ప్రపంచ సృజనాత్మకత శాస్త్రీయ ప్రపంచ ఆవిష్కరణలతో ముందుకు సాగుతుందన్నారు. అనంతరం శాస్త్రవేత్త ఎస్‌ఎల్‌ శ్రీనివాస్‌ నాన్‌ కాంటాక్ట్‌ క్రాస్‌ మీడియం కనెక్షన్‌ అనే అంశంపై ప్రసంగించారు. ఎన్‌ఎస్‌టీఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పీవీఎస్‌ గణేశ్‌కుమార్‌, బీవీఎస్‌ఎస్‌ కృష్ణకుమార్‌, పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాఘవేంద్రరావును ఎన్‌ఎస్‌టీఎల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు.

Updated Date - 2023-01-18T00:08:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising