ప్రాంతీయ అగ్నిమాపక అధికారిగా నిరంజన్‌రెడ్డి
ABN, First Publish Date - 2023-02-11T01:26:20+05:30
రీజనల్ ఫైర్ ఆఫీసర్ (ఆర్‌ఎఫ్‌వో)గా డి.నిరంజన్‌రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
మహారాణిపేట, జనవరి 10:
రీజనల్ ఫైర్ ఆఫీసర్ (ఆర్‌ఎఫ్‌వో)గా డి.నిరంజన్‌రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పరిపాలనా సౌలభ్యం కోసం అగ్నిమాపకదళ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నాలుగు ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటుచేసింది. వాటికి ప్రత్యేకంగా రీజనల్ ఫైర్ ఆఫీసర్‌లను నియమించింది. ఉత్తరాంధ్ర అగ్నిమాపక దళ అధికారిగా నియమితులైన నిరంజన్‌రెడ్డి నగరంలోని మహారాణిపేటలో గల కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో గల ఫార్మాసిటీ, సెజ్‌లలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఫైర్ ఆడిట్ నిర్వహించి రక్షణ చర్యలు చేపడతామని, మాక్ డ్రిల్స్, ప్రత్యేకంణ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. ఏప్రిల్‌లో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ఇకపై అగ్ని యాప్ ద్వారా తమ శాఖకు చెందిన ఎన్‌ఓసీలు అందించనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల ఫైర్ ఆఫీసర్‌లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - 2023-02-11T01:26:22+05:30 IST