ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిప్పుల కొలిమి

ABN, First Publish Date - 2023-04-13T01:33:42+05:30

ఉమ్మడి విశాఖ జిల్లా వరుసగా మూడో రోజు వడగాడ్పులకు ఉడికిపోయింది. పడమర దిశ నుంచి పొడిగాలులు వీస్తుండడం, సముద్రం నుంచి తగినంత తేమగాలులు రాకపోవడం, ఆకాశం నిర్మలంగా వుండడంతో ఎండ మండిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకూ వేడి వాతావరణం కొనసాగింది. వడగాడ్పులు వీయడంతో మధ్యాహ్న సమయంలో రహదారులపై జన సంచారం తగ్గింది. ఆరుబయటే కాకుండా ఇళ్లల్లో ఉండేవారు కూడా వేడికి తట్టుకోలేకపోయారు. సాధారణంగా తీర ప్రాంతాల్లో మధ్యాహ్న సమయానికి తేమగాలులు వీచి వాతావరణం చల్లబడాలి. కానీ బుధవారం అటువంటిదేమీ లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఉడికిన విశాఖ

పడమర గాలులతో జనం ఉక్కిరిబిక్కిరి

పెదగంట్యాడలో వడగాడ్పులు

ఎనిమిదేళ్ల తరువాత

విమానాశ్రయంలో 40 డిగ్రీలు నమోదు

నేడు కూడా వడగాడ్పులు వీస్తాయని హెచ్చరికలు

మధ్యాహ్నం మూడు గంటల వరకు

ప్రజలు రక్షిత ప్రాంతాల్లో ఉండాలని,

వడదెబ్బ నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచనలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విశాఖ జిల్లా వరుసగా మూడో రోజు వడగాడ్పులకు ఉడికిపోయింది. పడమర దిశ నుంచి పొడిగాలులు వీస్తుండడం, సముద్రం నుంచి తగినంత తేమగాలులు రాకపోవడం, ఆకాశం నిర్మలంగా వుండడంతో ఎండ మండిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకూ వేడి వాతావరణం కొనసాగింది. వడగాడ్పులు వీయడంతో మధ్యాహ్న సమయంలో రహదారులపై జన సంచారం తగ్గింది. ఆరుబయటే కాకుండా ఇళ్లల్లో ఉండేవారు కూడా వేడికి తట్టుకోలేకపోయారు. సాధారణంగా తీర ప్రాంతాల్లో మధ్యాహ్న సమయానికి తేమగాలులు వీచి వాతావరణం చల్లబడాలి. కానీ బుధవారం అటువంటిదేమీ లేదు.

ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీచినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలోని 26 మండలాల్లో వడగాడ్పులు వీచినట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అనకాపల్లి జిల్లాలో కోటవురట్ల, అచ్యుతాపురం, బుచ్చెయ్యపేట, మాకవరపాలెం, నక్కపల్లి, ఎలమంచిలి మండలాల్లో తీవ్రంగా, మరో 12 మండలాల్లో సాధారణ వడగాడ్పులు వీచాయి. అల్లూరి జిల్లాలో అనంతగిరి, అరకులోయ, గూడెంకొత్తవీధి, జి.మాడుగుల, హుకుంపేట, కొయ్యూరు, విశాఖపట్నం జిల్లాలో పెదగంట్యాడలో వడగాడ్పులు వీచినట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అనకాపల్లి జిల్లా కోటవురట్లలో 43.6, అచ్యుతాపురంలో 43, బుచ్చెయ్యపేటలో 42.9, మాకవరపాలెం, నక్కపల్లిల్లో 42.6, అరకులోయలో 42.5, అనంతగిరి, గూడెంకొత్తవీధిలో 42.3, ఎలమంచిలిలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల వరకు ఎక్కువని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. వేసవిలో సాధారణంగా ఎండలు బాగా ఉంటాయని, అయితే ఈ ఏడాది మారిన వాతావరణ పరిస్థితులతో వడగాడ్పులు వీస్తున్నాయన్నారు. సుమారు ఎనిమిదేళ్ల తరువాత ఏప్రిల్‌లో ఇంత తీవ్రమైన గాడ్పులు వీచాయన్నారు. ద్రోణులు, ఆవర్తనాలు లేకపోవడం, సముద్ర గాలులు బలంగా లేకపోవడంతో ఎండలు పెరిగాయన్నారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రజలు రక్షిత ప్రాంతాల్లో ఉండాలని, వడదెబ్బ నుంచి అన్నివిధాలా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎయిర్‌పోర్టులో 40.2 డిగ్రీలు

విశాఖ ఎయిర్‌పోర్టులో బుధవారం 40.2 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువ. ఎయిర్‌పోర్టులో ఈనెల 10న 38.6, 11న 39.6 డిగ్రీలు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు 37 డిగ్రీలు, మధ్యాహ్నం 12 గంటలకు 38, ఒంటిగంటకు 39.8, రెండు గంటలకు 40.2 డిగ్రీలు నమోదైంది. ఉదయం నుంచి పడమర దిశ నుంచి గాలులు వీయడంతో నగరం ఒక్కసారిగా వేడెక్కింది. మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు రావడానికి వెనుకంజ వేశారు. దీంతో జన సంచారం తగ్గింది. కాగా విశాఖ ఎయిర్‌పోర్టులో 2014 ఏప్రిల్‌ 1, 2, 24 తేదీల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మళ్లీ ఎనిమిదేళ్ల తరువాత బుధవారం 40 డిగ్రీలు నమోదైనట్టు విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. గురు, శుక్రవారాలు కూడా నగరంలో ఎండ తీవ్రత కొనసాగుతుందన్నారు.

Updated Date - 2023-04-13T01:33:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising