ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేవీ రోడ్డు బురదమయం

ABN, First Publish Date - 2023-09-20T01:28:00+05:30

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలో ఎన్‌ఏవోబీ ప్రధాన రహదారి బురదమయమైంది. అప్పన్నపాలెం కాలనీ సమీపంలో వాహనాలు బురదలో కూరుపోతున్నాయి. దీందో వాహనదారులతోపాటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయ నేవల్‌ బేస్‌ ఏర్పాటు కావడంతో మండలంలో వెంకటాపురం జంక్షన్‌ నుంచి వాడనర్సాపురం సమీపంలోని ఎన్‌ఏవోబీ గేటు వరకు కొత్తగా రోడ్డు నిర్మించారు.

అప్పన్నపాలెం కాలనీ జంక్షన్‌లో బురదమయమైన రోడ్డు, కూరుకుపోయిన వ్యాన్‌

కూరుకుపోయిన వాహనాలు, స్తంభించిన ట్రాఫిక్‌

రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

రాంబిల్లి, సెప్టెంబరు 19 : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలో ఎన్‌ఏవోబీ ప్రధాన రహదారి బురదమయమైంది. అప్పన్నపాలెం కాలనీ సమీపంలో వాహనాలు బురదలో కూరుపోతున్నాయి. దీందో వాహనదారులతోపాటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయ నేవల్‌ బేస్‌ ఏర్పాటు కావడంతో మండలంలో వెంకటాపురం జంక్షన్‌ నుంచి వాడనర్సాపురం సమీపంలోని ఎన్‌ఏవోబీ గేటు వరకు కొత్తగా రోడ్డు నిర్మించారు. ఈ మార్గంలో సాధారణ వాహనాలతోపాటు భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండడంతో పలుచోట్ల గోతులు ఏర్పడి అధ్వానంగా తయారైంది. కొన్ని గోతులను స్థానికులు గ్రావెల్‌, మట్టితో పూడ్చుకున్నారు. మిగిలిన చోట్ల వర్షం కురిస్తే గోతుల్లో నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. గోతుల్లో గ్రావెల్‌, మట్టి వేసిన చోట వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. అప్పన్నపాలెం కాలనీ జంక్షన్‌ వద్ద రోడ్డు మధ్య ఏర్పడిన భారీగొయ్యిలో మంగళవారం టాటా ఏస్‌ వాహనం కూరుకుపోయింది. మిగిలిన ప్రదేశం బురదగా వుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. ఆటోలు, వ్యాన్ల డ్రైవర్లు వాహనాల్లో నుంచి ప్రయాణికులను కిందకు దించి, ఖాళీ వాహనాన్ని బురదగా వున్న ప్రదేశం దాటించాల్సి పరిస్థితి నెలకొంది. పాదచారులు, ద్విచక్రవాహదారులు ఇక్కట్లు వర్ణనాతీతం.. వర్షం పడినప్పడల్లా ఇదే పరిస్థితి నెలకొంటున్నదని, అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గోతులను కనీసం మెటల్‌తో పూడ్చాలని ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2023-09-20T01:28:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising