సీలేరులో నిలిచిపోయిన నర్సీపట్నం డిపో బస్సు సీలేరులో నిలిచిన బస్సు
ABN, First Publish Date - 2023-02-20T01:08:59+05:30
నర్సీపట్నం డిపోకు చెందిన నర్సీపట్నం- సీలేరు బస్సు ఆదివారం గేర్ బాక్సులో సాంకేతిక లోపం కారణంగా సీలేరులో రెండున్నర గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు. అధికారులు కండీషన్‌లో లేని బస్సులను నడుపుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- గేర్ బాక్సులో సాంకేతిక లోపం వల్ల రెండున్నర గంటల పాటు నిలిపివేత
- కండీషన్‌లో లేని బస్సులను నడుపుతున్నారని ప్రయాణికుల ఆవేదన
సీలేరు, ఫిబ్రవరి 19 : నర్సీపట్నం డిపోకు చెందిన నర్సీపట్నం- సీలేరు బస్సు ఆదివారం గేర్ బాక్సులో సాంకేతిక లోపం కారణంగా సీలేరులో రెండున్నర గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు. అధికారులు కండీషన్‌లో లేని బస్సులను నడుపుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి నర్సీపట్నం డిపోకు చెందిన పాసింజర్ సర్వీస్ నర్సీపట్నంలో ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి మధ్యాహ్నం మూడున్నర గంటలకు సీలేరు చేరుతుంది. మళ్లీ 4 గంటలకు సీలేరులో బయలుదేరి రాత్రి తొమ్మిదిన్నరకు నర్సీపట్నం చేరుతుంది. అయితే ఆదివారం సీలేరు వచ్చే షెడ్యూల్ బస్సును శివరాత్రి తీర్థాలకు వేరే ప్రాంతానికి పంపించి, చింతపల్లి తిరిగే బస్సును సీలేరు పంపించారు. ఈ బస్సుకు గేర్ బాక్స్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. రివర్స్ గేర్ కూడా సరిగ్గా పని చేయలేదు. ఈ విషయాన్ని డ్రైవర్ నర్సీపట్నం డిపో అధికారులకు తెలపడంతో బస్సును ఫస్ట్, సెకండ్ గేర్లలో నెమ్మదిగా తీసుకురావాలని ఆదేశించారు. దీంతో సాయంత్రం ఆరున్నర గంటలకు సీలేరులో బస్సు ఖాళీగా బయలు దేరింది. రోజూ నాలుగు గంటలకు బస్సులో వెళ్లే ధారకొండ, దుప్పులవాడ , ఇతర ప్రాంతాల నుంచి సీలేరు సంతకు వచ్చిన వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సీలేరుకు కండీషన్‌లో లేని బస్సులను నడుపుతుండడం వల్ల తరచూ ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2023-02-20T01:09:00+05:30 IST