పాఠశాల పునఃప్రారంభం రోజే హాజరుకావాలి
ABN, First Publish Date - 2023-01-18T00:28:46+05:30
విద్యార్థులు పాఠశాల పునఃప్రారంభం రోజే విధిగా హాజరుకావాలని ఏటీడబ్ల్యూవో జయ నాగలక్ష్మి అన్నారు. మంగళవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలు గురువారం పునఃప్రారంభంకానున్నాయన్నారు.
తల్లిదండ్రులతో రావాలి
విద్యార్థులకు ఏటీడబ్ల్యూవో సూచన
చింతపల్లి, జనవరి 17: విద్యార్థులు పాఠశాల పునఃప్రారంభం రోజే విధిగా హాజరుకావాలని ఏటీడబ్ల్యూవో జయ నాగలక్ష్మి అన్నారు. మంగళవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలు గురువారం పునఃప్రారంభంకానున్నాయన్నారు. సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వెళ్లిన విద్యార్థినీ, విద్యార్థులు తొలిరోజే పాఠశాలకు హాజరుకావాలన్నారు. సాధారణంగా విద్యార్థులు రెండు, మూడు రోజులు ఆలస్యంగా పాఠశాలలకు వస్తుంటారన్నారు. విద్యార్థులు ముందుగా పాఠశాలకు హాజరు కావడం వల్ల విద్యాబోధన ప్రారంభించేందుకు అనువుగా ఉంటుందన్నారు. ఇళ్ల నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు మాత్రమే తీసుకు వచ్చి పాఠశాలలో అప్పగించాలని తెలిపారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు విద్యార్థులతో కచ్చితంగా పాఠశాలకు రావాలన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను కలిసి విద్యార్థినీ, విద్యార్థుల విద్యా ప్రగతిని అడిగి తెలుసుకోవాలన్నారు. ఎవరైన విద్యార్థులు సెలవుల్లో అస్వస్థతకు గురైతే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హెచ్‌డబ్ల్యూవోలకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఆశ్రమ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, హెచ్‌డబ్ల్యూవోలు తరగతి గదులు, వసతి గృహాలను విద్యార్థులు శుభ్రం చేయించి సిద్ధంగా ఉంచాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కచ్చితంగా పాఠశాల నిబంధనలు పాటించాలని ఆమె తెలిపారు.
Updated Date - 2023-01-18T00:28:51+05:30 IST