ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2023-02-15T00:44:51+05:30
శాసనమండలి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎ. మల్లికార్జున అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున
మహారాణిపేట, ఫిబ్రవరి 14: శాసనమండలి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎ. మల్లికార్జున అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 13న జరగనున్న ఈ ఎన్నికలను పర్యవేక్షించేందుకు నోడల్ అధికారులను నియవించినట్టు పేర్కొన్నారు. పీఓలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని, బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హెల్ప్ లైన్, మీడియా సెల్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
స్వర్ణభారతి స్టేడియం పరిశీలన
సీతంపేట: వచ్చే నెలలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. బుల్లయ్య కళాశాల పక్కనే గల స్వర్ణభారతి స్టేడియంను మంగళవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఎన్నికల సామగ్రి పంపిణీ కౌంటర్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి పొరపాటుకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్, తహసీల్దార్ శ్యామ్‌ప్రసాద్, జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-02-15T00:44:53+05:30 IST