ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవరవరంలో భూ వివాదం

ABN, First Publish Date - 2023-04-03T01:14:36+05:30

మండలంలోని గవరవరంలో భూ వివాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఒకరిపై మరొకరు బాహాబాహీకి దిగడంతో పాటు, కర్రలు, పెప్పర్‌ స్ర్పే, సురకత్తులతో దాడులకు పాల్పడడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

గవరవరంలో కొట్లాటకు దిగిన ఇరుపక్షాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చోడవరం, ఏప్రిల్‌ 2: మండలంలోని గవరవరంలో భూ వివాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఒకరిపై మరొకరు బాహాబాహీకి దిగడంతో పాటు, కర్రలు, పెప్పర్‌ స్ర్పే, సురకత్తులతో దాడులకు పాల్పడడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే తహసీల్దార్‌ సమక్షంలోనే ఈ దాడులకు దిగడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఓ వర్గం తరఫున విశాఖనగర పరిధిలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఉండడంతో అతనిపై ప్రధాన నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన వివరాలివి.

గవరవరం గ్రామంలో 52 సెంట్ల భూమికి సంబంధించి అదే గ్రామానికి చెందిన ఉప్పల అప్పారావు కుటుంబీకులకు, ఆ పంచాయతీ సర్పంచ్‌ చప్పగడ్డి మాణిక్యమ్మ కుటుంబీకులైన చప్పగడ్డ దేముళ్లునాయుడులకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఈ భూమిపై తమకే హక్కులున్నాయంటూ ఇరుపక్షాల వ్యక్తులు కొంతకాలంగా గొడవలు, ఘర్షణలు పడడంతో కేసుల వరకూ వ్యవహారం వెళ్లింది. ఈ భూమికి ఒకపక్షం కంచె వేయడం, రెండో పక్షానికి చెందిన వ్యక్తులు దానిని పీకేయడంతో తరచూ వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉప్పల అప్పారావు కుటుంబానికి చెందిన వ్యక్తులు ఈ భూమిని రీ సర్వే చేసి తమకు న్యాయం చేయాలంటూ స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం 4.15 గంటలకు చోడవరం తహసీల్దార్‌ బి.తిరుమలబాబు, రెవెన్యూ సిబ్బందితో గవరవరంలోని వివాదాస్పద స్థలం వద్దకు చేరుకున్నారు. ఈ సర్వేకు హాజరుకావాలంటూ ఇరుపక్షాలకు చెందిన వ్యక్తులను సమాచారం పంపడంతో వారు కూడా వచ్చారు. పొలానికి సంబంధించిన వివరాలను తహసీల్దార్‌ వాకబు చేస్తున్న సమయంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ వంకల అప్పలనాయుడుతో సర్పంచ్‌ వర్గానికి చెందిన వ్యక్తులు వాదనకు దిగారు. దీంతో ఇరుపక్షాల మధ్య మాటామాటా పెరిగి దాడులకు దిగారు. కర్రలు, ఇతర ఆయుధాలు ఉపయోగించి దాడులు చేసుకున్నారు. తహసీల్దార్‌ ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరుపక్షాలకు చెందిన వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. కాగా, ఈ ఘర్షణలో సర్పంచ్‌ మాణిక్యం వర్గానికి చెందిన చప్పగడ్డ అర్జున్‌, అప్పలనాయుడు, దేవుళ్లు, జొన్నపల్లి వెంకటరమణ, జొన్నపల్లి దేముళ్లు, మజ్జి రమణ, మజ్జి ఎరుకునాయుడులతో పాటు మరో ఐదు గురు వ్యక్తులు తమపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడినట్టు కానిస్టేబుల్‌ వంకల అప్పలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, తమపై ఉప్పల అప్పారావు వర్గానికి చెందిన కానిస్టేబుల్‌ వంకల అప్పలనాయుడు తనపైనా, తమ కుటుంబ సభ్యులైన వెంకటరమణతో పాటు, అతని కుమారుడిపైనా పెప్పర్‌ స్ర్పే చల్లి సురకత్తితో దాడికి పాల్పడినట్టు రెండో వర్గానికి చెందిన చప్పగడ్డి దేముళ్లునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు రెండు వర్గాలకు చెందిన 17మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్పంచ్‌ వర్గానికి చెందిన చప్పగడ్డి అర్జున్‌, చప్పగడ్డ అప్పలనాయుడు, చప్పగడ్డ దేముళ్లునాయుడు, జొన్నపల్లి వెంకటరమణ, జొన్నపల్లి దేవుడునాయుడు, మజ్జి రమణ, మజ్జి ఎరుకునాయుడు, మజ్జి అప్పలస్వామి, అన్నం వెంకటరమణ, చప్పగడ్డి శ్రీను, గుమ్మాల సత్తిబాబు, గుమ్మాల ఈశ్వరరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్పంచ్‌ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఆర్‌ కానిస్టేబుల్‌ వం కల అప్పలనాయుడు, ఉప్పుల అప్పారావు, ఉప్పుల లక్ష్మ ణ, ఉప్పుల నాగరాజు, బాలిబోయిన వెంకటరత్నంలపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ ఐ బి.అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ ఘటనలో ఇరుపక్షాలకు చెందిన వ్యక్తులపై కేసు నమోదు చేశామని, కానిస్టేబుల్‌ వంకల అప్పలనాయుడు సురకత్తితో దాడి చేయడంతో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయని తెలిపారు. వాదంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2023-04-03T01:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising