కిరండోల్ రైలు దంతెవాడ వరకే...
ABN, First Publish Date - 2023-09-22T01:26:51+05:30
భద్రతా కారణాల దృష్ట్యా విశాఖపట్నం-కిరండోల్ మధ్య రాకపోకలు సాగించే రైళ్లను ఈనెల 29వ తేదీ వరకు విశాఖ-దంతెవాడ మధ్య నడపనున్నట్టు వాల్తేరు రైల్వే సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.
విశాఖపట్నం, సెప్టెంబరు 21:
భద్రతా కారణాల దృష్ట్యా విశాఖపట్నం-కిరండోల్ మధ్య రాకపోకలు సాగించే రైళ్లను ఈనెల 29వ తేదీ వరకు విశాఖ-దంతెవాడ మధ్య నడపనున్నట్టు వాల్తేరు రైల్వే సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. విశాఖ-కిరండోల్ నైట్ ఎక్స్‌ప్రెస్ (18514) ఈనెల 21 నుంచి 28 వరకు విశాఖ నుంచి దంతెవాడ వరకు, కిరండోల్-విశాఖ నైట్ ఎక్స్‌ప్రెస్ (18513) ఈనెల 21 నుంచి 29 వరకు దంతెవాడ నుంచి విశాఖకు నడుస్తాయి. అలాగే, విశాఖ-కిరండోల్ రైలు (08551) ఈనెల 21 నుంచి 28 వరకు విశాఖ నుంచి దంతెవాడకు, కిరండోల్-విశాఖ రైలు (08552) ఈనెల 22 నుంచి 29 వరకు దంతెవాడ నుంచి విశాఖకు నడపనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2023-09-22T01:26:51+05:30 IST