ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనకాపల్లి పీటీడీని విశాఖ సిటీలో కలపాలి

ABN, First Publish Date - 2023-04-22T00:35:32+05:30

నకాపల్లి పీటీడీని విశాఖ సిటీలో చేర్చి బస్సు పాసులు నేరుగా ఇక్కడి నుంచే ఇవ్వాలని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దూలం గోపీ, తాడి రామకృష్ణ, శ్రీరాందాస్‌గోవింద, మళ్ల శ్రీను, భరిణికాన రాము కోరారు.

అనకాపల్లి పీటీడీ ట్రాఫిక్‌ ఎస్‌ఐ మూర్తికి వినతిపత్రం అందజేస్తున్న జనసేన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూరు, ఏప్రిల్‌ 21: అనకాపల్లి పీటీడీని విశాఖ సిటీలో చేర్చి బస్సు పాసులు నేరుగా ఇక్కడి నుంచే ఇవ్వాలని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దూలం గోపీ, తాడి రామకృష్ణ, శ్రీరాందాస్‌గోవింద, మళ్ల శ్రీను, భరిణికాన రాము కోరారు. శుక్రవారం ఆర్టీసీ ట్రాఫిక్‌ ఎస్‌ఐ మూర్తికి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనకాపల్లిని జీవీఎంసీలో విలీనం చేసి ఏళ్లు గడుస్తున్నా అనకాపల్లి పీటీడీని మాత్రం గ్రేటర్‌ పరిధిలోకి తీసుకురాకుండా కాలయాపన చేయడం అన్యాయమన్నారు. గత పదేళ్ల నుంచి లంకెలపాలెం నుంచి మాత్రమే సిటీ బస్‌పాసు వర్తిస్తున్నారని, అనకాపల్లి వరకు ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయమై పలుమార్లు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌, ఆర్టీసీ ఎండీ స్థాయి వరకు ఫిర్యాదు చేసినా మార్పు రాలేదన్నారు. అనకాపల్లి నుంచి బస్‌పాసులు వర్తింపజేసినట్టయితే అనకాపల్లి, తుమ్మపాల, కశింకోట, తాళ్లపాలెం, కూండ్రం, రేబాక, శంకరం, మామిడిపాలెం, మునగపాక, చోడవరం, గోవాడ తదితర గ్రామీణ ప్రాంతాల నుంచి రోజూ కళాశాలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధికి వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనకాపల్లిని సిటీ లిమిట్స్‌లో కలిపి ఇక్కడ నుంచే బస్‌పాస్‌లు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అప్పికొండ గణేష్‌, ప్రసాద్‌, లక్ష్మణ్‌, వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-22T00:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising