పరుశురామ అవతారంలో జగన్నాథస్వామి
ABN, First Publish Date - 2023-06-26T00:05:54+05:30
స్థానిక గూడ్స్‌షెడ్డు వద్ద గల ఇంద్రద్రుమ్నహాల్‌లో కొలువై ఉన్న జగన్నాథస్వామి ఆదివారం భక్తులకు పరుశురామ అలంకరణలో దర్శనమిచ్చారు.
పరుశురామ అవతారంలో ఉన్న జగన్నాథస్వామి
అనకాపల్లి టౌన్, జూన్ 25 : స్థానిక గూడ్స్‌షెడ్డు వద్ద గల ఇంద్రద్రుమ్నహాల్‌లో కొలువై ఉన్న జగన్నాథస్వామి ఆదివారం భక్తులకు పరుశురామ అలంకరణలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ పర్యవేక్షణలో వేదపండితులు సుప్రభాతసేవ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అనకాపల్లి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
Updated Date - 2023-06-26T00:05:54+05:30 IST