ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే స్టేషన్‌లో కనిపించని నిఘా!

ABN, First Publish Date - 2023-06-11T01:23:19+05:30

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునికీకరించడానికి కేంద్రం రూ.450 కోట్లు మంజూరు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలంకారప్రాయంగా మిగిలిన సీసీ కెమెరాలు

సగానికిపైగా పనిచేయడం లేదు

ప్లాట్‌ఫారంపై బాలుడి కిడ్నాప్‌ అయ్యి మూడు రోజులైనా ఆచూకీ తెలుసుకోలేకపోవడానికి అదే కారణం

పట్టించుకోని ఉన్నతాధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ రైల్వే స్టేషన్‌లో మూడు రోజుల క్రితం కిడ్నాపైన ఏడాదిన్నర బాలుడి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. తల్లి భవానీ కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. ఆమె ఏడు నెలల గర్భిణి. భర్తతో గొడవపడి ఇంట్లో నుంచి వచ్చేసింది. మనసులో ఆ బాధ. ఇప్పుడు బిడ్డ దూరమయ్యాడని ఆవేదన. రైల్వే పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి, రప్పించగలిగారు. బిడ్డ మాత్రం ఎక్కడున్నదీ చెప్పలేకపోతున్నారు. విచారణ చేస్తున్నామని చెబుతున్నారు.

ఇంత ఘోర వైఫల్యమా?

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునికీకరించడానికి కేంద్రం రూ.450 కోట్లు మంజూరు చేసింది. ఈ స్టేషన్‌ ఇప్పటికే అనేక అంశాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించింది. డివిజన్‌ అధికారులు వాటినే అధికంగా ప్రచారం చేసుకుంటూ స్టేషన్‌ భద్రతను పూర్తిగా జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ బృందాలకు వదిలేశారు. గంజాయి రవాణాకు ఆయువు పట్టు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌. అలాగే బంగారం అక్రమ రవాణా చేసేవారంతా ఇక్కడే రైళ్లు మారతారు. ఇటు కోల్‌కతా, అటు చెన్నైల నుంచి నగరానికి అక్రమంగా వచ్చే సరకులన్నీ ఇక్కడే డెలివరీ అవుతాయి. పార్శిల్‌ సర్వీస్‌ ద్వారా వచ్చిన వాటిని ముక్కు ముఖం తెలియని వారు వచ్చి వాహనాల్లో తీసుకుపోతుంటారు. రోజూ కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు ఇక్కడ అడ్డగోలుగా జరుగుతుంటాయి. అయినా ఎక్కడో ఎవరో ఫిర్యాదు చేస్తే తప్ప ఇక్కడ ఏదీ పట్టుబడదు. ఎటువంటి తనిఖీలు ఉండవు. ఇక రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో సీసీ కెమెరాలు కూడా చాలావరకూ పనిచేయడం లేదు. వాటి పనితీరు బాగా లేదని, వాటి అవసరం చాలా ఉందని ఎప్పుడూ ఏ అధికారి ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. ఎనిమిది ఫ్లాట్‌ఫారాలు, రోజూ లక్షకు పైగా జనాలు రాకపోకలు సాగించే స్టేషన్‌లో మొక్కుబడిగా 40 సీసీ కెమెరాలు మాత్రమే ఉండగా...అందులో సగమే పనిచేయడం రక్షణ దళాల నిర్లిప్తతకు అద్దం పడుతోంది.

ఇప్పటివరకు ఉన్నత స్థాయి సమీక్ష లేదు

ఏడాదిన్నర బిడ్డ తప్పిపోయి మూడు రోజులు అవుతున్నా ఈ కేసుపై రైల్వే ఉన్నతాధికారులు సమీక్షించిన దాఖలాలు లేవు. ఎటువంటి ప్రకటన చేయలేదు. భర్తను వదిలేసి తల్లి వేరే రాష్ట్రం నుంచి రావడం, ఆమె తరపున అడిగేవారు ఎవరూ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ కేసులో అనుమానితులు ఇద్దరు. ఆడ, మగ. వారిద్దరూ హిందీలో మాట్లాడారు. ఈ విషయాలపై కూడా జీఆర్‌పీ అధికారులు ప్రచారం చేయడం లేదు. కానీ అధికారులు మౌనంగా ఉన్నారు. బిడ్డను కనుగొనడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు ఏమిటో కూడా మీడియాకు వెల్లడించకపోవడం చూస్తుంటే...ఈ కేసును వారు సీరియస్‌గా తీసుకోలేదని అనిపిస్తోంది. డివిజన్‌ అధికారులు కూడా ఇది స్టేషన్‌ వ్యవహారమని వదిలేసినట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ ఎవరి మధ్య సమన్వయం లేదు. ఒకరి పరిధిలోకి మరొకరు వేలు పెడితే ఇబ్బందులు వస్తాయన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2023-06-11T01:23:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising