ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరిగిన టమాటా ధర

ABN, First Publish Date - 2023-06-01T00:21:43+05:30

నగరంలోని రైతుబజార్లలో టమాటా ధర ఒకేసారి కిలోకి రూ.11 పెరిగిపోయింది. గత నాలుగు రోజులుగా కిలో రూ.18 చొప్పున విక్రయిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, మే 31 (ఆంధ్రజ్యోతి): నగరంలోని రైతుబజార్లలో టమాటా ధర ఒకేసారి కిలోకి రూ.11 పెరిగిపోయింది. గత నాలుగు రోజులుగా కిలో రూ.18 చొప్పున విక్రయిస్తున్నారు. అంతకు ముందు కిలో రూ.16 నుంచి రూ.17 ఉండేది. మహారాష్ట్రలో ధరలు పెరగడం, పశ్చిమ బెంగాల్‌ వరకు ఆ సరకు వెళ్లడంతో డిమాండ్‌ పెరిగింది. అయితే ఇక్కడ రైతుబజార్లలో టమాటా ధర పెంచకుండా రూ.18 చొప్పున ఉంచడంతో జ్ఞానాపురం హోల్‌సేల్‌ వ్యాపారులు గిట్టుబాటు కావడం లేదని గత రెండు రోజులుగా సరకు తెప్పించడం మానేశారు. ఉన్న టమాటానే సోమ, మంగళవారాల్లో విక్రయించారు. అది పూర్తిగా అయిపోవడంతో బుధవారం ఒక్కసారిగా రేటు పెరిగిపోయింది. నగరంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండడంతో కొనుగోళ్లు పెరిగాయి. అయినా చాలాచోట్ల టమాటా లభించలేదు. ఇప్పుడు రేటు పెంచడంతో హోల్‌సేల్‌ వ్యాపారులు సరకుకు ఆర్డర్‌ ఇచ్చారు. ఇవి గురువారం సాయంత్రం నగరానికి చేరుకుంటాయి. ఇంకో వారం రోజులు ధరలు ఇలాగే ఉంటాయని ఎస్టేట్‌ అధికారులు అంటున్నారు.

సీఈఓ తనిఖీలు

రైతుబజార్ల సీఈఓ నంద కిశోర్‌రెడ్డి బుధవారం నగరంలోని రైతుబజార్లను తనిఖీ చేశారు. కంచరపాలెం, గోపాలపట్నం, సీతమ్మధార బజార్లను తనిఖీలు చేసి రైతులతో మాట్లాడారు. డ్వాక్రా సంఘాలు విక్రయిస్తున్న సరకులు పరిశీలించారు. కొన్ని బజార్లలో మౌలిక వసతులు పరిశీలించి, స్టాళ్లు, బాత్‌రూమ్‌లకు మరమ్మతులు చేయాలని సూచించారు.

Updated Date - 2023-06-01T00:21:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising