ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భారీ వర్షం

ABN, First Publish Date - 2023-07-25T01:43:10+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వరుసగా రెండో రోజు నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది.

లోతట్టు ప్రాంతాలు జలమయం

దొండపర్తిలో కూలిన వృక్షం

గోస్తనీ పంపు హౌస్‌ వద్ద 98.5 మి.మీ. వర్షపాతం నమోదు

నేడు, రేపు కూడా వర్షాలు

విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి):

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వరుసగా రెండో రోజు నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. ఉదయం పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. మధ్యాహ్నం సముద్రం నుంచి తేమగాలులు రావడంతో ఒక్కసారిగా మేఘాలు దట్టంగా అలముకుని వర్షం ప్రారంభమైంది. తొలుత పెందుర్తి పరిసరాల్లో ప్రారంభమైన వర్షం తూర్పుగా ఆనందపురం, పద్మనాభం వరకు, దక్షిణ వైపు అంటే గోపాలపట్నం మీదుగా నగరం వరకూ విస్తరించింది. కొన్నిచోట్ల గంట నుంచి రెండు గంటలపాటు భారీవర్షం కురిసింది. వర్షానికి గెడ్డలు, వాగులు పొంగాయి. పూర్ణామార్కెట్‌ పరిసరాలు, జ్ఞానాపురం, రైల్వే న్యూకాలనీతో పాటు శివారుల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. నగరంలోని బీచ్‌రోడ్డు పైకి వరద చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే దొండపర్తిలో భారీ చెట్లు నేలకొరగడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా రానున్న రెండు రోజుల్లో నగరంతో పాటు పరిసరాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

నగరంలో వర్షం వివరాలు

ప్రదేశం మిల్లీమీటర్లు

గోస్తనీ పంపుహౌస్‌ 98.5

పెందుర్తి నల్ల క్వారీ 84.75

నరవ 84.5

పద్మనాభం 76.25

అడవివరం 59.5

ఎండాడ 48

Updated Date - 2023-07-25T01:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising