ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దేశం’లో ఆనందం వెల్లి విరిసె..

ABN, First Publish Date - 2023-03-19T01:36:26+05:30

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిరంజీవిరావు గెలుపు వైసీపీ ప్రభుత్వానికి పెద్ద గుణపాఠమని మాడుగుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పీవీజీ కుమార్‌ అన్నారు.

చిరంజీవిరావుకు అభినందనలు తెలుపుతున్న చోడవరం టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు విజయంతో టీడీపీ శ్రేణులు సంబరాలు

విజేతను కొందరు నాయకులు కలిసి శుభాకాంక్షలు

దేవరాపల్లి, మార్చి 18 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిరంజీవిరావు గెలుపు వైసీపీ ప్రభుత్వానికి పెద్ద గుణపాఠమని మాడుగుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పీవీజీ కుమార్‌ అన్నారు. దేవరాపల్లి నాలుగు రోడ్ల కూడలిలో గల అంబేడ్కర్‌ విగ్రహానికి శనివారం సాయంత్రం పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కేక్‌కట్‌ చేసి, బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికలకు ఇది శుభసూచకమన్నారు. నాయకులు పోతల పాత్రునాయుడు, చెరకాన సూర్యనారాయణ, చల్లా నానాజీ, కొమార బాబూరావు, కడిం నాగేశ్వరరావు, బండారు రామారావు, కన్నబాబు, అప్పలనాయుడు, కర్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.

నర్సీపట్నం అర్బన్‌ : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు విజయం సాధించడంతో మండలంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడ్ని శనివారం ఆయన స్వగృహంలో జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ తన అభిమానులతో కలిసి అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన ప్రతిఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, టీడీపీ విజయభేరి మోగించడం తథ్యమని ఆమె స్పష్టం చేశారు.

చోడవరం : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావును పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు ఆధ్వర్యంలో నేతలంతా శనివారం అభినందించారు. తన విజయానికి కృషి చేసిన వారందరికీ ఈ సందర్భంగా చిరంజీవిరావు కృతజ్ఞతలు తెలిపారు.

చీడికాడ : రాష్ట్రంలో సైకో పాలకుడ్ని సాగనంపేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గెలుపొందడంతో శనివారం చీడికాడ రాజీవ్‌ కళామందిరం వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో కష్టపడి పనిచేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు పోతల చిన్నంనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొబ్బాది తాతారావు, నాయకులు గండి ముసలినాయుడు, పంచాడ దాలెంనాయుడు, శరగడం శివ, బండారు శేష గిరి రావు, పైల ముత్యా లనాయుడు, బీళ్ల కోటేశ్వరరావు, బండారు దయాకర్‌, గౌరీ పట్టపు నానాజీ, కురచా సురేష్‌, గాడిప్రసాద్‌, జగదీష్‌, జె.ప్రసాద్‌ పాల్గొన్నారు.

మాకవరపాలెం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు విజయంతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని టీడీపీ మండల అధ్యక్షుడు ఆర్‌.వై.పాత్రుడు, మండల ఇన్‌చార్జి అల్లు రామునాయుడు అన్నారు. పార్టీ విజయోత్సవాల్లో భాగంగా శనివారం ఇక్కడ ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి శ్రేణులంతా సమష్టిగా పనిచేయాలన్నారు. అనంతరం కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు. నాయకులు రుత్తల శేషుకుమార్‌, బుచ్చి రాంప్రసాద్‌, చినబాబు, కోసూరు శ్రీనివాసరావు, కేతిరెడ్డి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

మాడుగుల రూరల్‌ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంపై పార్టీ మాడుగుల మండల నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఇక్కడి కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు కేక్‌కట్‌చేసి పంచిపెట్టారు. ఈ గెలుపుతోనే వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది ఆరంభమైందన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యం గా అంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. నాయకులు ఉండూరు దేముడు, బుద్దాల రమణ, సన్యాసిరావు, ఓండ్రు కృష్ణ, నాయుడులతో పాటు పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T01:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising