6న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం
ABN, First Publish Date - 2023-04-03T00:14:51+05:30
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈనెల ఆరో తేదీని నిర్వహించేందుకు మేయర్ గొలగాని హరివెంకటకుమారి నిర్ణయించారు.
52 అంశాలతో సిద్ధమైన అజెండా
విశాఖపట్నం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈనెల ఆరో తేదీని నిర్వహించేందుకు మేయర్ గొలగాని హరివెంకటకుమారి నిర్ణయించారు. ఈ మేరకు సమావేశంలో చర్చించి, నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా 52 అంశాలతో అజెండాను సిద్ధం చేసినట్టు తెలిసింది. సమావేశానికి సంబంధించిన సమాచారంతో పాటు అజెండా కాపీలను జీవీఎంసీ అధికారులు ఇప్పటికే కమిటీ సభ్యులకు అందజేశారు.
Updated Date - 2023-04-03T00:14:51+05:30 IST